Hypersonic Missile : డ్రాగన్ దూకుడు.. అణు సామర్థ్యం కలిగిన హైపర్సోనిక్ మిసైల్ ప్రయోగించిన చైనా
అంతరిక్షానికి సంబంధించి చైనా మరింత దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ ఏడాది ఆగస్టులో తొలిసారి అణు సామర్థ్యం కలిగిన ఓ హైపర్సోనిక్ మిసైల్ పరీక్షను చైనా మిలటరీ చేపట్టినట్లు
- venkaiahnaidu
- Published On : October 17, 2021 / 05:41 PM IST
China
Hypersonic Missile: అంతరిక్షానికి సంబంధించి చైనా మరింత దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ ఏడాది ఆగస్టులో తొలిసారి అణు సామర్థ్యం కలిగిన ఓ హైపర్సోనిక్ మిసైల్ పరీక్షను చైనా మిలటరీ చేపట్టినట్లు తాజాగా బ్రిటన్‌కు చెందిన వార్తాపత్రిక “ఎన్‌హెచ్‌కే వరల్డ్” తెలిపింది. లాంగ్ మార్చ్ రాకెట్ నుంచి ఆగస్టులో చేపట్టిన ఈ ప్రయోగాన్ని చైనా రహస్యంగా ఉంచింది.
ఈ మిసైల్.. గగనతలంలో తక్కువ ఎత్తు నుంచే ప్రయాణించిందని, అయితే లక్ష్యం మాత్రం గురి తప్పినట్లు బ్రిటన్ వార్తాపత్రిక తెలిపింది. దాని లక్ష్యం వైపు వెళ్లడానికి ముందు తక్కువ కక్ష్యలో భూమి చుట్టూ ఈ మిసైల్ ప్రదక్షిణ చేసిందని తెలిపింది. క్షిపణి లక్ష్యానికి 32 కిమీ దూరంలో వెళ్లిందని.. ప్రయోగం విజయవంతం కాకున్నా.. హైపర్సోనిక్ మిసైల్ టెక్నాలజీపై చైనా పురోగతి అమెరికా ఇంటెలిజెన్స్ ను షాక్‌కు గురి చేసిందని తెలిపింది.
అయితే.. అమెరికా, రష్యాతో పాటు మరో ఐదు దేశాలు ఇప్పటికే ఈ హైపర్సోనిక్ మిసైల్స్ ను అభివృద్ధి చేసే పనిలో ఉన్నాయి. ధ్వని కంటే ఐదు రెట్లు వేగంగా ప్రయాణించగల ఈ మిస్సైల్‌ను చైనా కనుక పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తే అమెరికా, జపాన్ క్షిపణి రక్షణ వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని నిపుణులు అంటున్నారు.
ALSO READ బీసీసీఐలో పెద్ద ఉద్యోగాలు.. 9రోజుల్లోగా అప్లై చేసుకోవాలి
