BCCI: బీసీసీఐలో పెద్ద ఉద్యోగాలు.. 9రోజుల్లోగా అప్లై చేసుకోవాలి

టీమిండియా క్రికెట్‌కు హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ అవనున్నారని దాదాపు ఫిక్స్ అయిపోయారు. కాకపోతే కొత్తగా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) ఆదివారం ప్రకటన చేసింది.

BCCI: బీసీసీఐలో పెద్ద ఉద్యోగాలు.. 9రోజుల్లోగా అప్లై చేసుకోవాలి

bcci

BCCI: టీమిండియా క్రికెట్‌కు హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ అవనున్నారని దాదాపు ఫిక్స్ అయిపోయారు. కాకపోతే కొత్తగా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) ఆదివారం ప్రకటన చేసింది. టీమిండియా కోసం హెడ్ కోచ్, బ్యాటింగ్ కోచ్, బౌలింగ్ కోచ్, ఫీల్డింగ్ కోచ్ పదవులు దాంతో పాటు నేషనల్ క్రికెట్ అకాడమీ కోసం హెడ్ స్పోర్ట్స్ సైన్స్ / హెడ్ స్పోర్ట్స్ మెడిసిన్ ల కోసం అప్లికేషన్లు ఆహ్వానించింది.

అక్టోబర్ 26 సాయంత్రం 5గంటలలోగా హెడ్ కోచ్ పదవికి అప్లై చేసుకోవాలి. మిగిలిన వారికి మాత్రం నవంబర్ 3వరకూ గడువు ఉంది.

1. Head Coach (Team India – Senior Men)
2. Batting Coach (Team India – Senior Men)
3. Bowling Coach (Team India – Senior Men)
4. Fielding Coach (Team India – Senior Men)
5. Head Sports Science/Medicine with National Cricket Academy (NCA)

………………………………………… : దసరా ఎంజాయ్, రూ. 222.23 కోట్ల లిక్కర్, 50 లక్షల చికెన్ సేల్!

ఈ వారం ఆరంభంలో రాహుల్ ద్రవిడ్ టీమిండియా కోచ్ పదవికి సమ్మతించాడంటూ వార్తలు వినిపించాయి. ఆదివారంతో మొదలైన టీ20 వరల్డ్ కప్ ముగియగానే రవిశాస్త్రి ఆ బాధ్యతల నుంచి తప్పుకోనున్నాడు.

టీమిండియా టీ20 వరల్డ్ కప్ ఈవెంట్ లో తొలి మ్యాచ్ ను అక్టోబర్ 24న పాకిస్తాన్ తో ఆడనుంది. సూపర్ 12ఫేజ్ లో భాగంగా గ్రూప్ 2లో ఉన్న ఇరు జట్లు అఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్ తో కలిసి ఒకే గ్రూపు జాబితాలో ఉన్నాయి.