కరోనాకు కారణం అవేనని తెలిసిపోయిందా.. పిల్లులు, కుక్కలు తినడం ఆపేసిన చైనా

చైనాలోని షెంజన్ నగరం పిల్లులు, కుక్కలు తినడాన్ని నిషేదించింది. కరోనా వైరస్ నేపథ్యంలో సైంటిస్టులకు ఓ అనుమానం వచ్చింది. జంతువుల నుంచే మనుషులకు వచ్చిందా అని భావిస్తున్నారు. ఇప్పటివరకూ చైనాలో బయటపడ్డ ఇన్ఫెక్షన్లన్నీ వూహాన్ లోని గబ్బిలాలు, పాములు వంటి జీవుల నుంచే పుట్టినట్లు బయటపడ్డాయి. 9లక్షల 35వేల మంది వైరస్ బారిన పడితే 47వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు చైనీస్ టెక్నాలజీ హబ్ కుక్కలను, పిల్లులను తినడం మే1 నుంచి నిషేదిస్తున్నట్లు ప్రకటించింది.

‘అన్ని జంతువుల కంటే కుక్కలు మనుషులతో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాయి. ఈ కారణంగానే కుక్కలను, పిల్లులను, ఇతర పెంపుడు జంతువులను వృద్ధి చేయాలనుకుంటున్నాం. హాంకాంగ్, తైవాన్ లలో చేసినట్లుగానే మేమూ చేయాలనుకుంటున్నాం. అక్కడ మానవ మనుగడపై ప్రభావం చూపించడం ఖాయం’ 

ఆసియాలోని చాలా ప్రాంతాల్లో కుక్కలను తింటారు. సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ అధికారి లూయీ జియాన్‌పింగ్ మాట్లాడుతూ.. పౌల్ట్రీ, సీ ఫుడ్ వినియోగదారులకు సరిపోతాయి కుక్క, పిల్ల మాంసం తినడం మానేస్తే వచ్చే కొరతేమీ ఉండదు. పౌల్ట్రీ, లైవ్ స్టాక్ కంటే కుక్కలను తినడం బలమని ఏ రీసెర్చ్ చెప్పలేదు. కరోనా మహమ్మారి నుంచి పాఠం నేర్చుకున్న తొలి సిటీ షెంజన్. మరో మహమ్మారి ఆ ప్రాంతాన్ని వణికించకముందే తేరుకోవాలనేదే టార్గెట్’ అని వైల్డ్ లైఫ్ డిపార్ట్ మెంట్ ఫర్ హ్యుమన్ సొసైటీ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఎమ్ టెలెక్కి అంటున్నారు. 

ఈ మాంసం తినడం వల్లే కరోనా లాంటి వైరస్ లు వ్యాపిస్తున్నాయనే అనుమానం లేకపోతే.. షెంజన్ ఈ నిర్ణయం తీసుకోదు. ఇలాగే ప్రపంచ దేశాలన్నీ కీలక నిర్ణయాలు తీసుకుంటే మరో మహమ్మారి రాకముందే మేలుకుంటే సరిపోతుంది కదా. 

Also Read | వాహనదారులకు గుడ్ న్యూస్ : పెట్రోల్, డీజిల్ అత్యంత శుభ్రం