గబ్బిలాలు, కుక్కలు, పిల్లులు.. కరోనాకు అసలు కారణం చెప్పిన మాజీ క్రికెటర్

ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. చైనీయులపై ఫైర్ అయ్యాడు. చైనీయుల ఆహారపు

  • Publish Date - March 14, 2020 / 12:38 PM IST

ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. చైనీయులపై ఫైర్ అయ్యాడు. చైనీయుల ఆహారపు

ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. చైనీయులపై ఫైర్ అయ్యాడు. చైనీయుల ఆహారపు వల్లే కరోనా వచ్చిందని షోయబ్ నిందించాడు. ‘కరోనా వైరస్‌ చైనా వల్లే వచ్చింది. చైనీయులు తిండి అలవాట్ల వల్లే కరోనా ప్రబలింది. కరోనాకు 100శాతం కారణం చైనీయుల తిండి అలవాట్లే. గబ్బిలాలు, కుక్కలు, పిల్లులు తింటారా. అంతా చైనా వల్లే’ అని తన సొంత యూట్యూబ్ చానల్ లో చైనీయుల తిండి అలవాట్లపై షోయబ్ విరుచుకుపడ్డాడు.

గబ్బిలాలు, కుక్కలు, పిల్లులు ఎందుకు తింటారో:
చైనీయుల దరిద్రమైన ఆహారపు అలవాట్ల వల్లే కరోనా వైరస్ వచ్చిందని, ప్రపంచం ప్రమాదంలో పడిందని షోయబ్ మండిపడ్డాడు. చైనీయులు గబ్బిలాలు, కుక్కలు, పిల్లులు వంటి వాటిని ఎందుకు తింటారో, వాటి రక్తం, మూత్రం ఎలా తాగుతారో అర్థం కావడం లేదన్నాడు. ఇలాంటి ఆహారపు అలవాట్లతో కరోనా వైరస్ వచ్చిందని, దాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపజేస్తున్నారని, ప్రపంచాన్ని ప్రమాదంలో పడేశారని షోయబ్ అన్నాడు. చైనీయుల ఆహారపు అలవాట్లు తనకు తీవ్రమైన కోపం తెప్పిస్తున్నాయన్నాడు. కరోనా కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, పర్యాటక రంగాలు సంక్షోభంలో పడ్డాయని షోయబ్ వాపోయాడు.

చైనీయులకు వ్యతిరేకం కాదు:
అదే సమయంలో చైనా ప్రజలంటే తనకు కోపం లేదన్న షోయబ్, వారి ఆహారపు అలవాట్లకు తాను వ్యతిరేకం అన్నాడు. ఆ ఆహారపు అలవాట్లు చైనీయుల సంస్కృతిలో భాగం కావొచ్చన్న షోయబ్ దాని వల్ల ప్రపంచానికి ఎలాంటి ఉపయోగం లేదన్నాడు. చైనీయులను బాయ్ కాట్ చేయాలని తాను అనడం లేదన్న షోయబ్, ఏదో ఒక నియమాన్ని పాటించాలని, ప్రతి దాన్ని తినకూడదని కోరాడు.

145 దేశాలకు విస్తరించిన కరోనా:
2019 డిసెంబర్ లో చైనాలోని వుహాన్ లో పుట్టిన కరోనా వైరస్‌ చైనాని సర్వనాశనం చేసింది. ఇప్పుడిప్పుడే చైనాలో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకునేలోగానే కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలపై పడింది. 145 దేశాలకు కరోనా వ్యాపించింది. ప్రపంచవ్యాప్తంగా 5వేల మంది చనిపోయారు. లక్ష మందికి పైగా కరోనా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ కరోనాతో ఇప్పటికే చాలా దేశాల ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. వేల కంపెనీలు మూసేశారు. మరికొన్ని కంపెనీలైతే.. వర్క్‌ ఫ్రం హోంతో ముందుకు వెళుతున్నాయి. స్టాక్‌ మార్కెట్లు కరోనా దెబ్బకు కుప్పకూలాయి. లక్షల కోట్ల సంపద ఆవిరి అవుతోంది. కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. భారత్‌లో 85 మందికి కరోనా సోకగా…అందులో ఇద్దరు చనిపోయారు. అలాగే కరోనాతో ఐపీఎల్‌ కూడా వాయిదా పడింది. పాకిస్తాన్ లో 28 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

క్రీడా కార్యక్రమాలు రద్దు:
కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా క్రీడా కార్యక్రమాలు రద్దయ్యాయి. పాకిస్తాన్ సూపర్ లీగ్ ను కుదించారు. ఐపీఎల్ ను వాయిదా వేశారు. దీనిపై షోయబ్ అక్తర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ”చాలా ఏళ్ల తర్వాత పాకిస్తాన్ లో క్రికెట్ మ్యాచులు జరుగుతున్నాయి, పాకిస్తాన్ సూపర్ లీగ్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. విదేశీ ఆటగాళ్లు వెళ్లిపోతున్నారు, మిగతా మ్యాచులు ప్రేక్షకులు లేకుండానే జరగబోతున్నాయి” అని షోయబ్ వాపోయాడు.