ఆస్ట్రేలియాలో చైనా స్టూడెంట్ల కిడ్నాప్.. అసలు నిజమిదే

ఆస్ట్రేలియాలో చైనా స్టూడెంట్లు సొంతగా కిడ్నాప్ కు గురై ఫేక్ సీన్లు సృష్టిస్తున్నారు. డాలర్ డ్రీమ్స్ లో బతికేస్తున్న కుటుంబాలకు ఇది షాకింగ్ మారింది. న్యూ సౌత్ వేల్స్ లోని ఎనిమిది మంది వర్చువల్ కిడ్నాపింగ్స్ జరిగాయని రిపోర్ట్ చేశారు. ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీస్ 25 కిడ్నాపింగ్ ఎక్స్‌టార్షన్ కేసులపై దర్యాప్తు జరుపుతున్నట్లు, చైనా స్టూడెంట్లనే దేశవ్యాప్తంగా టార్గెట్ చేసినట్లు అనిపించి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.



ఈ స్కాంలు అన్నీ ఫ్రాడ్ కాలర్.. సృష్టించి చైనీస్ అథారిటీ నుంచి ఫోన్ వచ్చినట్లుగా నమ్మిస్తారు. నిందితులపై చైనా ప్రభుత్వం కచ్చితంగా లీగల్ యాక్షన్ తీసుకుంటారనేట్లుగా చిత్రీకరిస్తారు. సొంతగా కిడ్నాప్ అయిపోయి ఫేక్ గా చెప్పుకుంటూ డబ్బులు అడుగుతుంటారు. ఫ్యామిలీకి కిడ్నాప్ అయినట్లుగా డూప్ ఫొటోలను పంపుతారు.

చైనా స్టూడెంట్లు కిడ్నాప్ అయినట్లుగా నమ్మించడానికి ఫోన్ వాడటం మానేస్తారు. సోషల్ మీడియా కాంటాక్ట్స్, హాస్టల్ ఖాళీ చేయడం, కట్టేసి ఉన్నట్లుగా ఫొటోలు ఫ్యామిలీలకు పంపిస్తూ ఉంటారు. ఇలాంటి మోసాల్లో ఈ ఏడాది 3.2మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల దందా జరిగింది. వారిలో చాలా మంది 20వేల డాలర్ల నుంచి 5లక్షల డాలర్ల వరకూ డిమాండ్ చేసేవారట. ఒక కుటుంబం అయితే తమ కూతుర్ని కాపాడుకోవడానికి 2మిలియన్ డాలర్లు పంపిందట.



ఎక్కడో పొరుగుదేశం ఆస్ట్రేలియా చదువుకుంటున్న పిల్లలు కిడ్నాప్ అయ్యారంటే ఆ ఫ్యామిలీలకు ఎంత భయం. కానీ, చైనా స్టూడెంట్లు అయినట్లు ఫేక్ కిడ్నాప్ లు సృష్టించి డబ్బు వసూలు చేసుకుంటున్నారు. ఈ చైనా అథారిటీ స్కాంలు మొత్తం 1172ఉన్నాయని రికార్డులు చెబుతున్నాయి.