న్యూజిలాండ్ కాల్పుల్లో 40కి పెరిగిన మృతులు

న్యూజిలాండ్ లో దుండగుల కాల్పుల ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. చనిపోయిన వారి సంఖ్య 40కి చేరింది. క్రైస్ట్ చర్చ్ నగరంలోని 2 మసీదుల్లో దుండగులు కాల్పులకు తెగబడ్డారు.

  • Publish Date - March 15, 2019 / 07:34 AM IST

న్యూజిలాండ్ లో దుండగుల కాల్పుల ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. చనిపోయిన వారి సంఖ్య 40కి చేరింది. క్రైస్ట్ చర్చ్ నగరంలోని 2 మసీదుల్లో దుండగులు కాల్పులకు తెగబడ్డారు.

న్యూజిలాండ్ లో దుండగుల కాల్పుల ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. చనిపోయిన వారి సంఖ్య 40కి చేరింది. క్రైస్ట్ చర్చ్ నగరంలోని 2 మసీదుల్లో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ప్రార్థనలకు వచ్చిన వారిపై తూటాల వర్షం కురిపించి నరమేధం సృష్టించారు. దుండగులు పేలుడు పదార్దాలతో వచ్చారు. ప్రార్థనలు జరుగుతున్న సమయంలో మసీదులోకి ఒక్కసారిగా ప్రవేశించిన దుండగులు.. 20నిమిషాల పాటు కాల్పులు జరిపినట్టు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే చాలామంది తూటాలకు బలైపోయారు. 40మంది చనిపోయారు. 20మంది తీవ్రంగా గాయపడ్డారు. హ్యాగ్లీ పార్క్ సమీపంలోని మసీద్ కి బంగ్లాదేశ్ క్రికెటర్లు వచ్చారు. కాల్పులు జరిగిన సమయంలో వారు అక్కడే ఉన్నారు. కాల్పుల నుంచి వారి క్షేమంగా బయటపడ్డారు.

Read Also: కాల్పుల కలకలం : బంగ్లా క్రికేటర్లకు తప్పిన ప్రమాదం

మసీదుల్లోకి ఎంతమంది చొరబడ్డారు, ఎంతమంది కాల్పులు జరిపారు అనేదానిపై స్పష్టత లేదు. వలసవాద వ్యతిరేక విధానాలకు మద్దతు తెలుపుతున్న వారే ఈ కాల్పులకు తెగబడి ఉంటారని న్యూజిలాండ్ ప్రభుత్వం భావిస్తోంది. ఎంతో ప్రశాంతంగా ఉండే న్యూజిలాండ్ లో ఈ కాల్పుల ఘటన ప్రకంపనలు పుట్టించింది. పౌరులకు న్యూజిలాండ్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా క్రైస్ట్ చర్చ్ లోని మసీదులు, పాఠశాలలను తాత్కాలికంగా మూసేశారు. ప్రార్థనల కోసం ముస్లింలు ఎవరూ మసీదుల్లోకి వెళ్లవద్దని సూచించారు.

Read Also: న్యూజిలాండ్‌లో ఫైరింగ్ : 12 మంది మృతి

కాల్పుల అనంతరం నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. వీరిలో ఒక మహిళ, ముగ్గురు పురుషులు ఉన్నారు. ప్రస్తుతం వారిని విచారిస్తున్నారు. ప్రమాదం ముగిసి పోయిందని ఎవరూ భావించవద్దని… అందరూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. శుక్రవారం(మార్చి 15) కావడంతో ఎక్కువ సంఖ్యలో ముస్లింలు ప్రార్దనలకు వచ్చారు. వారిని లక్ష్యంగా చేసుకుని ఈ కాల్పులు జరిగాయి. ఘటన సమయంలో ఒక మసీదులో 300మంది వరకు ఉన్నారని చెబుతున్నారు. మసీదులో మృతదేహాలు పడి ఉన్నాయి. ఒంటినిండా ఆయుధాలతో ఉన్న ఓ వ్యక్తి మసీదులోకి చొరబడి కాల్పులకు తెగబడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.