Ghost : బాయ్‌ఫ్రెండ్ కత్తితో పొడిచి చంపబోతే, దెయ్యం వచ్చి కాపాడిందట .. దెయ్యానికి ధన్యవాదాలు చెబుతున్న టీచర్

నా బాయ్ ఫ్రెండ్ తనను చంపటానికి కత్తితో పొడిచి పారిపోతే ఓ దెయ్యం తనను కాపాడిందని ..ఆ దెయ్యం చేసిన సహాయం వల్లనే తాను ప్రాణాలతో ఉన్నానని తెలిపింది ఓ టీచర్. తాను ప్రాణాలతో రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతుంటే రెండు దెయ్యాలు తనను చూసి నవ్వాయని మరో దెయ్యం వచ్చి కాపాడింది అంటూ ఇంటర్వ్యూలో తెలిపింది. ఈ దెయ్యం కథ వైరల్ అవుతోంది.

Ghost who saved the woman

Ghost who saved the woman : దెయ్యాలు ఉన్నాయా..? అంటే ఉన్నాయని కొంతమంది దెయ్యాలు లేవు గియ్యాలు లేవని మరికొంతమంది అంటుంటారు. దీనికి ససరైన సమాధానం చెప్పటం చాలాచాలా కష్టం.అది వారి వారి నమ్మకాలను బట్టి ఉంటుంది. భయం దెయ్యం కంటే మా చెడ్డది భయ్యా అంటారు. కానీ ఓ టీచర్ మాత్రం తాను దెయ్యాన్ని చూశానని..ఆ దెయ్యమే తనను కాపాడిందని తన బాయ్ ఫ్రెండ్ తనను కత్తితో పదే పదే పొడిచి చంపబోతే రక్తపు మడుగులో ప్రాణాలతో పోరాడుతున్న తనను ఓ దెయ్యం కాపాడిందని చెబుతోంది.

టీచర్ కదాని  కథలు చెబుతోంది అనుకుంటున్నారా..? కానే కాదు తనకు నిజంగా జరిగింది ఆ దెయ్యం వల్లే తాను ప్రాణాలతో ఉన్నానని బల్లగుద్ది మరీ చెబుతోంది. అంతేకాదు తాను చావు బతుకుల్లో ఉంటే రెండు దెయ్యాలు తనను చూసి పగలబడి నవ్వాయట..మరో దెయ్యం వచ్చి ఆమెను కాపాడిందట..

ఇక ఈ దెయ్యం కాపాడిన విషయానికొస్తే..అది అమెరికా (America). ఆమె పేరు ఇలిష్‌ పో (Eilish Poe). టెక్సాస్‌ (Texas) రాష్ట్రంలోని కొలరాడోలో నివసిస్తోంది. ఇలిష్‌ పో (Eilish Poe)వయస్సు 25 ఏళ్లు. ఆమె కొలరాడో (Colorado)లో ఓ స్కూల్లో టీచర్ గా పనిచేస్తోంది. ఆమె గత జులైలో ‘అదర్ వరల్డ్’ పోడ్ కాస్ట్ షోలో పాల్గొంది. ఐదు ఎపిసోడ్స్ షోలో పాల్గొన్న ఆమె తనకు 2020లో జరిగిన ‘దెయ్యం’ ఘటన గురించి చెప్పుకొచ్చింది.

Judge Shoots Wife : రెస్టారెంట్‌లో చిన్న గొడవ .. భార్యను కాల్చి చంపేసిన న్యాయమూర్తి

ఈ దెయ్యం కథ గురించి ఇలిష్ పో మాట్లాడుతు..’’2020 నవంబర్ 4న నా మాజీ బాయ్ ఫ్రెండ్ జోనాథన్ క్రాస్లీ (Jonathan Crossley)నాపై కత్తితో దాడి చేశాడు. కత్తితో 16 సార్లు కత్తితో పొడిచాడు. 16సార్లు పొడటంతో ఇక చనిపోయానని భావించి వెళ్లిపోయాడు. ఆ కత్తిపోట్లకు నా మెడ,చేతులు, శరీరం అంతా రక్తసిక్తంగా మారిపోయింది.రక్తపు మడుగుల్లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాను. బాధతో అరుస్తున్నాను. కానీ కాపాడటానికి ఎవ్వరు రాలేదు. ఆ సమయంలో నాకు మూడు దెయ్యాలు కనిపించాయి. నేను భయపడ్డాను. ఆ మూడు దెయ్యాల్లో రెండు దెయ్యాలు బాధతో నేను అరుస్తుంటే నన్ను చూసి పగలబడి నవ్వాయి. కానీ మరో దెయ్యం వచ్చి నన్ను కాపాడింది. నన్ను చూసిన నవ్విన దెయ్యాల్లో ఒక దెయ్యం మా అమ్మమ్మ. ఆమె పేరు జీనీ, ఆమె 2014లో చనిపోయింది. మరో దెయ్యం నా చిన్ననాటి స్నేహితుడు విక్కీ. అతను 2020 ఫిబ్రవరిలో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. మా అమ్మమ్మ దెయ్యం, నా ఫ్రెండ్ దెయ్యం నన్ను చూసి నవ్వాయి. కానీ మరో దెయ్యం మాత్రం నన్ను కాపాడింది. తనను కాపాడిన ఆ దెయ్యం అలీసా అర్కెట్ (Alyssa Burkett) అని మా రెలిటివ్. అలీసా దెయ్యం నన్ను ప్రాణాపాయం నుంచి రక్షించింది. రక్తపు మడుగులో విలవిల్లాడుతున్న నేను కదిలే పరిస్థితిలో లేను..కానీ అలీషా దెయ్యం నన్ను ఫోన్ వద్దకు లాక్కెళ్లింది. పోలీసులకు 911కి కాల్ చేయమని ప్రోత్సహించింది. అలీసా దెయ్యం చేసిన సహాయంతో నేను పోలీసులకు ఫోన్ చేశాను..దాంతో పోలీసులు వచ్చి తనను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లటంతో బతికి బయటపడ్డాను’’ అని చెప్పుకొచ్చింది.

తాను ఆస్పత్రిలో కోలుకుంటున్న సమయంలో కూడా తనకు దాదాపు 100 సార్లు అస్పష్టంగా కొన్ని రూపాలు కనిపించాయని గుర్తు చేసుకుంది. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఆమె తన ప్రాణాలు కాపాడిన అలీషా దెయ్యానికి ధన్యవాదాలు తెలిపింది. ఎలీషా దెయ్యం వల్లే ఈరోజు తాను జీవించి ఉన్నానని ఇలా ఇంటర్వ్యూలో పాల్గొన్నానని తెలిపింది.నాపై దాడి చేసిన తరువాత తన మాజీ బాయ్ ఫ్రెండ్ జోనాథన్ క్రాస్లీ ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపింది. అలా తనను ఓ దెయ్యం కాపాడింది అంటూ ఇంటర్వ్యూలో ఇలిష్‌ పో టీచర్ చెప్పిన ఈ ‘దెయ్యం’ కథ ప్రస్తుతం తెగ వైరల్‌ అవుతోంది.

 

ట్రెండింగ్ వార్తలు