Russian Oil: తోక ముడిచిన అమెరికా.. రష్యా నుంచి ఇండియా చమురు కొనడంపై అభ్యంతరం లేదట

దీనికి ముందు డిసెంబరులో అమెరికా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ మాట్లాడుతూ.. ధరల పరిమితి రష్యన్ చమురుపై తగ్గింపును లాక్ చేస్తుందని.. దీంతో చైనా, భారతదేశం వంటి దేశాలు ధరల తగ్గింపు కోసం బేరసారాలు చేయగలవని అన్నారు. ఉక్రెయిన్‌లో యుద్ధానికి ఆజ్యం పోస్తున్న రష్యా ఆదాయాన్ని తగ్గించడం ధరల పరిమితి యొక్క ఆలోచనగా అమెరికా నిర్ణయించింది.

Russian Oil: ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో రష్యాపై అనేక ఆంక్షలు విధించిన అమెరికా.. ఆ దేశం నుంచి భారత్ చమురు కొనడంపై అభ్యంతరం చెప్పింది. అయితే అమెరికా బెదిరింపులకు భారత్ గట్టిగా సమాధానం ఇచ్చింది. రష్యా నుంచి ఇంధనం కొనుగోలు విషయంలో నిర్ణయం మారదని, ఎవరి ఒత్తిడులకు తలొగ్గేది లేదని కేంద్ర పెట్రోలియం మంత్రి అప్పట్లో తేల్చి చెప్పారు. అయితే చేసే ప్రయత్నాలు అన్నీ చేసి, ఇక భారత్‭ను లొంగదీసుకోవడం వీలు కాదని తెలిసిన అమెరికా.. ఎట్టకేలకు తోక ముడిచింది. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలుపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, ఈ విషయమై భారత్‌పై ఆంక్షలు విధించడం పట్ల అమెరికా దృష్టి సారించడం లేదని ఐరోపా-యురేషియా వ్యవహారాల అమెరికా సహాయ కార్యదర్శి కరెన్ డాన్‌ఫ్రైడ్ బుధవారం తెలిపారు.

Adani Group: 500 మిలియన్ డాలర్ల బ్యాంకు రుణాలు చెల్లించనున్న అదానీ

భారత్‌తో సంబంధాలు అత్యంత పర్యవసానంగా ఉన్నాయని, అమెరికా, భారత్‌ల విధానపరమైన అంశాలు భిన్నంగా ఉండవచ్చని, అంతర్జాతీయ నియమాలను గౌరవిస్తూ ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాన్ని పరస్పరం గౌరవించాలనే నిబద్ధతకు ఇరు దేశాలు కట్టుబడి ఉంటాయని ఆమె తెలిపారు. రష్యా చమురు కొనుగోలుపై భారతదేశం అనుసరిస్తున్న విధానంతో అమెరికా “సౌకర్యవంతంగా ఉంది” అని అమెరికా ఇంధన వనరుల అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ జియోఫరీ ప్యాట్ అన్నారు. ఇటీవల జరిగిన చాలా ద్వైపాక్షిక చర్చల్లో ఇంధన భద్రత అనేది ఎంత ముఖ్యమైందో వెల్లడైందని ఆయన ప్రస్తావించారు.

Turkiye Syria Earthquake: టర్కీ, సిరియాలో 15వేలు దాటిన మృతుల సంఖ్య.. శిథిలాల కింద కొనసాగుతున్న అన్వేషణ

సీనియర్ అమెరికా దౌత్యవేత్తలు రష్యా చమురుపై విధించిన ధర పరిమితిని సమర్థించారు. అయితే భారతదేశం ఇందులో పాల్గొనకపోయిప్పటికీ, మెరుగైన ధరను చర్చించడానికి ఇది ఒక అవకాశమని ప్యాట్ అన్నారు. దీనికి ముందు డిసెంబరులో అమెరికా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ మాట్లాడుతూ.. ధరల పరిమితి రష్యన్ చమురుపై తగ్గింపును లాక్ చేస్తుందని.. దీంతో చైనా, భారతదేశం వంటి దేశాలు ధరల తగ్గింపు కోసం బేరసారాలు చేయగలవని అన్నారు. ఉక్రెయిన్‌లో యుద్ధానికి ఆజ్యం పోస్తున్న రష్యా ఆదాయాన్ని తగ్గించడం ధరల పరిమితి యొక్క ఆలోచనగా అమెరికా నిర్ణయించింది.

ట్రెండింగ్ వార్తలు