Adani Group: 500 మిలియన్ డాలర్ల బ్యాంకు రుణాలు చెల్లించనున్న అదానీ
అమెరికా స్టాక్ మార్కెట్ నుంచి అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ను తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా ఎస్ అండ్ పీ డౌజోన్స్ ప్రకటించింది. అకౌంటింగ్‌లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చినందుకే ఈ నిర్ణయం తీసుకున్నామంది డౌజోన్స్. అమెరికా సంస్థ డోజోన్స్ సస్టెయినబిలిటీ సూచీ నుంచి అదానీ ఎంటర్ ప్రైజెస్ షేర్లను తొలగిస్తున్నట్లుగా నిర్ణయిం తీసుకున్నారు. ఫిబ్రవరి (2023)నుంచి ఈ నిర్ణయం అమలులోకి రానుంది.

Adani Group: బ్యాంకుల నుంచి తీసుకున్న 500 మిలియన్ డాలర్ల రుణాన్ని ముందస్తుగానే చెల్లించేందుకు అదానీ గ్రూప్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. హిండెన్ బర్గ్ నివేదిక అనంతరం తీవ్ర ఒడిదుడుకులతో పాటు పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో ఈ రుణాల చెల్లింపు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. వ్యాపార విస్తరణ నిమిత్తం బ్యాంకుల నుంచి అదానీ గ్రూప్ 4.5 బిలియన్ డాలర్ల రుణం తీసుకుంది. ఇందులో కొంత రుణాన్ని మార్చి 9 నాటికి చెల్లించాలి.
PM Modi: అదానీని వదలని అపోజిషన్.. యూపీఏ స్కాంలను ఎకరువు పెట్టిన పీఎం మోదీ
ఇక ముందస్తుగా రుణం చెల్లింపు అనంతరం, మరికొంత రుణం ఇవ్వాలని బ్యాంకులతో అదానీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఈ ఒప్పందం ప్రకారమే ముందుగానే రుణం చెల్లించి, గడువులోగా మళ్లీ దాన్ని రుణం రూపంలో తిరిగి తీసుకోనున్నట్లు బిజినెస్ వార్తా పత్రిక ఒకటి పేర్కొంది. ఒకప్పుడు ప్రపంచంలో రెండవ అత్యంత సంపన్న వ్యక్తిగా వెలుగొందిన గౌతమ్ అదానీ కార్పొరేట్ సామ్రాజ్యం అతి తక్కువ సమయంలో అత్యంత భారీ నష్టాన్ని చవిచూసింది. అదానీ టోటల్ గ్యాస్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ పోర్ట్స్‌తో సహా పది అదానీ గ్రూప్ కంపెనీలు ఒక దశలో 117 బిలియన్ డాలర్లు తగ్గింది.
Kamalnath: వివాదాస్పద ధీరేంద్ర శాస్త్రిని కలుసుకోనున్న కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్