Kamalnath: వివాదాస్పద ధీరేంద్ర శాస్త్రిని కలుసుకోనున్న కాంగ్రెస్ సీనియర్ నేత కమల్నాథ్
భారతీయ జనతా పార్టీని ఇరుకున పెట్టాలని కాంగ్రెస్ పార్టీ అనుకున్న ప్రతీసారి.. కమల్నాథ్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. రామమందిరం విషయంలో కూడా ఇదే జరిగింది. రామమందిరం పూర్తి క్రెడిట్ బీజేపీ తీసుకుని కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టింది. ఏమీ తోచలేని స్థితిలో కాంగ్రెస్ ఉంటే.. కమల్నాథ్ మాత్రం రామాలయ శంకుస్థాపనకు వెళ్లారు

Senior Congress leader Kamal Nath to meet controversial Dhirendra Shastri
Kamalnath: మూఢనమ్మకాలను వ్యాప్తి చేయడమే కాకుండా, వివాదాస్పద వ్యాఖ్యలతో అశాంతికి కారణమవుతున్నారనే విమర్శలు బాబా ధీరేంద్ర కృష్ణ శాస్త్రిపై అనేకం ఉన్నాయి. గత కొంత కాలంగా ఆయన మీద నెట్టింట్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రాజకీయ నాయకులు సైతం ఆయనను కలుస్తున్నారనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో అలాంటిదేమీ లేదని నాయకులే సమాధానం ఇచ్చుకోవాల్సి వస్తోంది. అయితే ఇలాంటి సందర్భంలో ధీరేంద్ర శాస్త్రిని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కమల్నాథ్ కలుసుకోవడానికి బాగేశ్వర్ ధామ్ వెళ్తుండడం కొత్త చర్చకు దారి తీస్తోంది.
Tripura Polls: త్రిపుర బరిలో 41 మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు
భారతీయ జనతా పార్టీని ఇరుకున పెట్టాలని కాంగ్రెస్ పార్టీ అనుకున్న ప్రతీసారి.. కమల్నాథ్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. రామమందిరం విషయంలో కూడా ఇదే జరిగింది. రామమందిరం పూర్తి క్రెడిట్ బీజేపీ తీసుకుని కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టింది. ఏమీ తోచలేని స్థితిలో కాంగ్రెస్ ఉంటే.. కమల్నాథ్ మాత్రం రామాలయ శంకుస్థాపనకు వెళ్లారు. ఇక పలు సందర్భాల్లో ఇదే జరిగింది. ఇక ధీరేంద్ర శాస్త్రి మీద విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ సమయంలో కమల్నాథ్ బాగేశ్వర్ ధామ్ బయల్దేరడం కాంగ్రెస్ వర్గాల్లో అసంతృప్తిని రేకెత్తిస్తోందని సమాచారం.
Asaduddin Owaisi: ఇందిరా పాలన తెస్తున్నారంటూ మోదీ ప్రభుత్వాన్ని నిలదీసిన ఓవైసీ