ఎక్కడ చూసినా మంచు…బయటకు వెళ్లాలంటే భయం..మంచుతో కూడిన వర్షం..దానికి తోడు బలమైన ఈదురు గాలులు..చెట్లు..ఇంటి బయట నున్న కార్లు..మొత్తం మంచుతో కప్పుకపోయాయి.
అమెరికా : ఎక్కడ చూసినా మంచు…బయటకు వెళ్లాలంటే భయం..మంచుతో కూడిన వర్షం.. దానికి తోడు బలమైన ఈదురు గాలులు.. చెట్లు.. ఇంటి బయట నున్న కార్లు.. మొత్తం మంచుతో కప్పుకపోయాయి. ఇదంతా అమెరికాలో నెలకొన్న పరిస్థితి… భారీగా మంచు కురుస్తుండడం…ఆపై బలమైన గాలులు వీస్తుండడంతో ఇప్పటి వరకు ఐదుగురు మృత్యుఒడిలోకి చేరారు.
ప్రజల ఇక్కట్లు…
అమెరికాలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొత్త సంవత్సరంలో ఎంజాయ్ చేయలేని పరిస్థితి నెలకొంటుండడంతో అక్కడి ప్రజలు తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు. ఇక్కడి నుండి వేరే ప్రాంతానికి వెళుదామన్నా..విమానాలు ఆలస్యంగా రాకపోకలు సాగిస్తుండడం…రోడ్లపై భారీగా మంచు పేరకపోతుండడంతో వారు ఎటూ వెళ్లలేకపోతున్నారు.
స్కూళ్లకు..కార్యాలయాలకు సెలవులు…
ఆగ్నేయ ప్రాంతంలో మంచు కురుస్తుండగా..దీనికి తోడు ఈదురు గాలులు వీస్తున్నాయి. పాఠశాలలకు… కార్యాలయలకు సెలవులు ప్రకటించారు. కొలరాడో, న్యూ మెక్సికో, హరిజనో, టెక్సాస్ ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తుందని..ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అక్కడి రాష్ట్ర వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
రహదారులపై భారీగా మంచు…పలు ప్రమాదాలు…
రహదారులపై భారీగా మంచు పేరుకపోతోంది. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతుండడంతో పేరుకపోయిన మంచు గడ్డలను తొలగించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. రోడ్లు..విమానాశ్రయాలపై భారీగా మంచు పేరుకపోయింది. ఎదురుగా వస్తున్న వాహనాలు కనబడకపోతుండడంతో పలు ప్రమాదాలు ఎదురవుతున్నాయి. దాదాపు 500కి పైగా విమానాలు రద్దు కాగా…5700 విమాన సర్వీసులను లేటుగా నడుపుతున్నారు.