కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు అందరూ పనులు మానుకుని ఇంట్లోనే ఉంటున్నారు. చాలామంది పేద కుటుంబాలు ఉపాధి కోల్పోతున్నారు. పనిచేస్తే గాని రోజుగడవని వారికి మేమున్నామంటు సెలబ్రెటీలంతా సాయం చేయడానికి ముందుకొస్తున్నారు. ఈ క్రమంలో నిన్న హీరో నితిన్ 10 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు.
ఈ రోజు (మార్చి 24, 2020) పేదలు, చిన్నవ్యాపారులు, స్వయం ఉపాధి కళాకారులకు, చేతివృత్తిదారులు కరోనా బారిన పడితే వారి వైద్య అవసరాల కోసం తమ ఫౌండేషన్ మెడికల్ ఫండ్‌గా రూ 1.5 కోట్ల విరాళం ఇవ్వనున్నట్టు ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అనితా డోంగ్రే తెలిపారు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో.. ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండటానికి లాక్‌డౌన్‌తో చిరు వ్యాపారులపై పెనుప్రభావం చూపుతుందని, ఈ వైరస్‌తో పెరిగే వైద్య అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు తమ ఫౌండేషన్ ముందుకొస్తుందని పోస్ట్‌లో ఆమె పేర్కొన్నారు.
అంతేకాదు తమవద్ద పనిచేసే ఉద్యోగులందరికీ వైద్య బీమా ఉందని, అత్యవసర పరిస్థితుల్లో వారికి కూడా ఈ ఫండ్ విస్తరిస్తుందని డిజైనర్ పేర్కొన్నారు. ఇక అంతర్జాతీంగా ప్రముఖ డిజైనర్లు.. జార్జియో అర్మానీ, డోనాటెల్లా వెర్సాస్, డొమెనికో డోల్స్ , స్టెఫానో గబ్బానా అంతా కలిసి కరోనా బారిని పడిన వారికి సహాయం చేయడానికి లక్షలాది విరాళాలు ఇచ్చారు.
Also Read | ఐపీఎల్ రద్దు.. ఇదే ఫస్ట్ టైమ్!