ఇప్పటికే హమాస్, హిజ్బుల్లా చాలా నష్టపోయాయి. ఇప్పుడు సిరియా నుంచి ఆ దేశ మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ పారిపోయాడు. దీంతో ఇరాన్‌కు అతి పెద్ద సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ పరిణామాలన్నీ ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమాలను మరింత ఉద్ధృతం చేసేలా ఉన్నాయని నిపుణులు అంటున్నారు.
తాము మరింత నష్టపోకుండా, రక్షణగా ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేసుకునే సూచనలు కనపడుతున్నాయని అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది. ఇరాన్ ముందు ఇప్పుడు రెండే దారులు ఉన్నాయి. మొదటిది అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌తో కొత్తగా చర్చలు జరపడం. రెండోది అణ్వాయుధ రేసులో మరో అడుగు ముందుకు వేయడం.
ఇదే తమను తాము రక్షించుకోవడానికి తమ దేశం ముందున్న చివరి మార్గమని ఇరాన్ భావిస్తుండొచ్చని అంతర్జాతీయ మీడియా అంటోంది. నిజానికి ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేసుకునే ప్రయత్నాల గురించి ఆలోచించండం ఇది కొత్తేం కాదు. ఇరాన్ వద్ద ఇప్పటివరకు అణ్వాయుధాలు లేవు.
అణ్వాయుధ దేశంగా అవతరించాలని రహస్యంగా కార్యకలాపాలు జరుపుతున్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. 2015 అణ్వాయుధ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘిస్తూ యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇప్పుడు చోటుచేసుకుంటున్న పరిణామాల దృష్ట్యా ఇరాన్ మరింత వేగవంతంగా అణ్వాయుధాలను అభివృద్ధి చేసుకోవాలని భావిస్తుండొచ్చు.
గాజాలో హమాస్, తరువాత లెబనాన్‌లో హిజ్బుల్లా, ఇప్పుడు సిరియాలో అసద్ చుట్టూ చోటుచేసుకున్న పరిణామాలతో తమ మిత్రులు బలహీనపడిపోతున్నారన్న భావన ఇరాన్‌లో ఉంది. దీంతో అణ్వాయుధమే తమ మనుగడకు అంతిమంగా రక్షణగా నిలుస్తుందని ఇరాన్ నాయకత్వం భావిస్తుండొచ్చు.
ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు అణ్వాయుధాలను అభివృద్ధి చేసుకునేందుకు ఇరాన్‌ను భౌగోళికంగా, రాజకీయంగా మరింత ప్రేరేపిస్తాయి. అణ్వాయుధాలను అభివృద్ధి చేసుకునేందుకు ఇరాన్ వద్ద ఇప్పటికే అవరసమైన మెటీరియల్ ఉందని ఇటీవల అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ తెలిపింది. ఇరాన్ అణ్వాయుధాలతో ఇజ్రాయెల్, సౌదీ అరేబియా వంటి ప్రత్యర్థులను ఎదుర్కోవడమే కాకుండా అమెరికా దాని మిత్రదేశాలకూ కౌంటర్ ఇవ్వవచ్చని బావిస్తోంది.
Mlc Kavitha : ఉద్యమ తల్లిని కాంగ్రెస్ తల్లిగా మార్చేశారు- సీఎం రేవంత్ పై ఎమ్మెల్సీ కవిత ఫైర్