Guinness World Records : నిముషంలో 10 ట్రిక్స్ చేసి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన ఆవు

ఆ ఆవు అన్నింటికంటే ప్రత్యేకమైనది. ఏది నేర్పితే అది చురుగ్గా నేర్చేసుకుంది. 60 సెకండ్లలో 10 ట్రిక్స్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. అందరితో ఔరా అనిపించుకుంది.

Guinness World Records

Guinness World Records : ప్రపంచ రికార్డు సాధించిన జాబితాలో కుక్కలు, పిల్లులు, చిలుకలు, కుందేళ్లు, గినియా పిగ్స్ ఇలా చాలా జంతువులు ఉన్నాయి. అయితే తాజాగా ఘోస్ట్ అనే ఆవు 60 సెకండ్లలో 10 విన్యాసాలు చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో పేరు సంపాదించింది.

Rajasthan farmer cow calf : ఆవు కోసం ఆరెకరాలు అమ్మి రైతన్న అలుపెరగని పోరాటం .. దూడ కోసం డీఎన్ఏ టెస్ట్ చేయించి తల్లీ బిడ్డల్ని కలిపిన కథ

USAలోని నెబ్రాస్కాలో ఘోస్ట్ అనే ఆవు కేవలం 60 సెకండ్లలో పది విన్యాసాలు చేసి గిన్నిస్ వర్లడ్ రికార్డ్స్ సాధించింది. ఈ విషయాన్ని గిన్నిస్ యాజమాన్యం తమ యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేసింది. మేగాన్ రీమాన్ అనే మహిళ సాయంతో ఘోస్ట్ ‘స్టే ఇన్ ఎ ప్లేస్, స్పిన్, బెల్ టచ్, హోడ్ నోడ్’ ఇలా పది విన్యాసాలు చేసి చూపించింది. అయితే ఘోస్ట్‌కి కొంచెం స్టేజ్ ఫియర్ ఉందట. అయినా ఇక నిముషంలో అత్యథికంగా విన్యాసాలు చేసి రికార్డు నెలకొల్పినట్లు గిన్నిస్ యాజమాన్యం ప్రకటించింది. ఇలా ఈ జాబితాలో ఆవు చేరడం ఇదే మొదటిసారని తెలిపింది.

Cow comforting a child : పసిబిడ్డను ఓదారుస్తున్న ఆవు.. వైరల్ అవుతున్న క్యూట్ వీడియో

ఆవుకి పెరిగే కొద్దీ అనేక అంశాలను చేయగలదని.. రంగుల మధ్య తేడాను కూడా గుర్తించగలదని ఘోష్ట్‌కి సాయపడ్డ మహిళ మేగాన్ రీమాన్ చెప్పారు. దానిని చూసినప్పటి నుంచి ప్రత్యేకంగా కనిపించిందని దాని కోసం ఏదైనా చేయాలనే నిర్ణయంతో శిక్షణ ఇచ్చినట్లు ఆమె తెలిపారు. ఇలా మొత్తానికి ఘోష్ట్ గిన్నిస్ రికార్డు బద్దలు కొట్టింది.