Hikes Petrol Prices
Pakistan : సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్థాన్ దేశంలో తాజాగా మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. పెరుగుతున్న ఆర్థిక సవాళ్ల మధ్య పాకిస్థాన్ శుక్రవారం పెట్రోల్, హైస్పీడ్ డీజిల్ ధరలను మరోసారి పెంచింది. అంతర్జాతీయ మార్కెట్‌లో పెట్రో ధరల పెరుగుతున్న ట్రెండ్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాక్ ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో తెలిపింది.
Ganesh idol : హుబ్బళ్లి ఈద్గా మైదానంలో గణేష్ విగ్రహం ఏర్పాటుకు మున్సిపల్ అనుమతి
పెట్రోలు ధరలు లీటరుకు పాకిస్థాన్ రూపాయల్లో (PKR) 26.02, హై-స్పీడ్ డీజిల్ లీటరుకు 17.34 పాక్ రూపాయల చొప్పున పెంచారు. (Crisis Hit Pakistan Hikes Petrol And Diesel Prices) ఈ పెంపు రెండు వారాల్లో రెండవ సారి పెరుగుదల. పాకిస్థాన్‌లో పెట్రోల్ ఇప్పుడు లీటరుకు 333.38 పాక్ రూపాయలకు విక్రయిస్తున్నారు. హై-స్పీడ్ డీజిల్ ధర లీటరుకు 329.18 రూపాయలకు పెరిగింది.
Encounter : బారాముల్లాలో ఎన్‌కౌంటర్…ఉగ్రవాది హతం
ఈ నెల ప్రారంభంలో పాకిస్థాన్‌లో పెట్రోల్ ధరలు తొలిసారిగా 300 బెంచ్ మార్కు స్థాయిని అధిగమించాయి. చారిత్రక ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్లకు దారితీసిన ఇటీవలి ఆర్థిక సంస్కరణల కారణంగా ఆ దేశంలో పెట్రోల్, విద్యుత్ ధరలు పెరిగాయి. నవంబర్‌లో జరగనున్న జాతీయ ఎన్నికలకు ముందు పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతతో పాటుగా ఆర్థిక పరిస్థితులు దిగజారాయి.