ఆస్ట్రేలియాలో భయం భయం : రోడ్లపై మొసళ్ల విహారం

ఆస్ట్రేలియాలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ప్రజలు ప్రాణభయంతో హడలిపోతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటే వణికిపోతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం

  • Publish Date - February 5, 2019 / 02:54 AM IST

ఆస్ట్రేలియాలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ప్రజలు ప్రాణభయంతో హడలిపోతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటే వణికిపోతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం

ఆస్ట్రేలియాలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ప్రజలు ప్రాణభయంతో హడలిపోతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటే వణికిపోతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం  గడుపుతున్నారు. ఇందుకు కారణం మొసళ్లు. నీటిలో ఉండాల్సిన మొసళ్లు ఇళ్ల మధ్యకు వచ్చేశాయి. ఆస్ట్రేలియాలోని రోడ్ల మీద స్వేచ్చగా తిరుగుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళన  చెందుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు ఆస్ట్రేలియాను ముంచెత్తాయి. కుండపోత వర్షాలకు ఆస్ట్రేలియా అతలాకుతలమైంది. వరద నీరు ఊళ్లను ముంచెత్తింది. వరద నీటితో  పాటు మొసళ్లు, విషపూరితమైన పాములు కూడా కొట్టుకువస్తున్నాయి. స్థానిక ప్రజలకు అవి ప్రాణాంతకంగా తయారయ్యాయి. ఏ గుంతలో ఏ నీరుందో అని కాకుండా, ఏ నీళ్లల్లో ఏ మొసలి  ఉందోనని స్థానికులు వణికిపోతున్నారు.

 

వీధుల్లోకి వచ్చేసిన మొసళ్లు ఇళ్లల్లోకి చేరితే పరిస్థితేమిటని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అలర్ట్ అయిన ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించింది. వాళ్లు మొసళ్లవేటలో పడ్డారు. మొసళ్లను  బంధించి వాటిని జనావాసాల నుంచి దూరంగా తరలిస్తున్నారు.

 

8 రోజులుగా ఆస్ట్రేలియాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత వందేళ్ల కాలంలో ఇలాంటి వర్షాలు చూడలేదని ప్రజలు అంటున్నారు. దీనికి తోడు మొసళ్ల బీభత్సం భయభ్రాంతులకు గురిచేస్తోంది.  భారీ వర్షాలకు ఆస్ట్రేలియాలో జనజీవనం స్తంభించింది. ముందు జాగ్రత్తగా స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఎయిర్‌పోర్టులు మూసివేశారు. వీధుల్లోకి రావద్దని సైన్యం ప్రజలకు హెచ్చరికలు  జారీచేసింది. మరో 72 గంటల్లో భారీ వర్షాలు కొనసాగుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

 

వర్షాల కారణంగా 20వేల మంది నిరాశ్రయులయ్యారు. బాధితులును సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 70వేల ఇసుక బ్యాగులను సైన్యం ప్రజలకు చేరవేస్తోంది. వాటి ద్వారా వారిని  కాపాడుతోంది. క్వీన్స్‌ల్యాండ్ రాష్ట్రంలోని టౌన్స్ విల్లే సిటీ వాసుల పరిస్థితి దయనీయంగా ఉంది. సిటీ మొత్తం నీటిలో మునిగిపోయింది. ఇళ్లు నీటిలో మునిగిపోవడంతో ప్రజలు రూఫ్స్ ఎక్కి సాయం  కోసం ఎదురుచూపులు చూస్తున్నారు.