Petrol-Diesel Price: వాహనదారులకు షాక్.. పశ్చిమాసియాలో మళ్ళీ యుద్ధ మేఘాలు.. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగే ఛాన్స్!

పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య మొదలైన భీకర(Petrol-Diesel Price) దాడులు అంతర్జాతీయ సమాజాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.

Crude oil prices surged following attacks on oil tankers in the Strait of Hormuz

  • హార్ముజ్ జలసంధిలో ట్యాంకర్లపై దాడులు
  • భగ్గుమన్న ముడి చమురు ధరలు
  • పెట్రోల్ డీజిల్ పెరిగే అవకాశం

Petrol-Diesel Price: పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య మొదలైన భీకర దాడులు అంతర్జాతీయ సమాజాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన హార్ముజ్ జలసంధి పరిధిలో వరుసగా బాంబు, క్షిపణి దాడులు జరగడంతో చమురు, గ్యాస్ ట్యాంకర్ల రాకపోకలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. ఇరాక్, యూఏఈ ఓడరేవుల సమీపంలో సరుకు రవాణా నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరగడంతో గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లలో తీవ్ర అనిశ్చితి నెలకొంది.

Telangana Ministers Met Governor: ఎర్రవల్లి ఘటనపై భగ్గుమన్న మంత్రులు.. బీఆర్‌ఎస్‌పై గవర్నర్‌కు ఫిర్యాదు.. చట్టపరమైన చర్యలకు నిర్ణయం

మండే చమురు ధరలు.. 109 డాలర్లు దాటిన ఇండియన్ బాస్కెట్ క్రూడ్:

ఈ దాడుల తక్షణ ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధరలు(Petrol-Diesel Price) ఒక్కసారిగా 2.5 శాతం పెరిగాయి. భారతదేశం కొనుగోలు చేసే ‘ఇండియన్ బాస్కెట్’ ముడి చమురు ధర బ్యారెల్‌కు ఏకంగా 108.91 డాలర్లకు చేరుకుందని పిపిఎసి వర్గాలు వెల్లడించాయి. ఆగస్టు నెలాఖరుతో పోలిస్తే చమురు ధరల్లో దాదాపు 20 శాతం మేర పెరుగుదల నమోదు కావడంతో దిగుమతి వ్యయం భారంగా మారనుంది.

సామాన్యుడిపై భారం.. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ప్రియం కానున్నాయా?

భారతదేశం తన చమురు అవసరాల్లో 85 శాతానికి పైగా, ఎల్పీజీలో 60 శాతం వరకు విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటోంది. ఈ సరఫరాలో మెజారిటీ భాగం హార్ముజ్ జలసంధి గుండానే రావాల్సి ఉండటంతో, తాజా ఉద్రిక్తతలు భారత్‌లో ఇంధన కొరత, ద్రవ్యోల్బణ భయాలను పెంచుతున్నాయి. 2026 మే నాటి పరిస్థితులు పునరావృతమై త్వరలోనే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపు తప్పకపోవచ్చనే ప్రచారం సామాన్యులను కలవరపెడుతోంది.