130 రోజులు… క్యూబాలో No New Domestic Cases

  • Publish Date - July 20, 2020 / 08:50 AM IST

కరోనా మహమ్మారికి అగ్రరాజ్యాలు బెంబేలెత్తిపోతున్నాయి. వైరస్ గడగడలాడిస్తోంది. కానీ ఓ చిన్న దేశం మాత్రం సమర్థవంతంగా ఎదుర్కొంది. ప్రస్తుతం అక్కడ ఎలాంటి కేసులు నమోదు కావడం లేదు. దీంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సాధారణ పనులు నిర్వహించుకొనేందుకు ప్రజలు సిద్ధమౌతున్నారు. ఇంతకు ఏ దేశమా అని ఆలోచిస్తున్నారా ? అదే క్యూబా. ప్రపంచంలోనే అన్ని దేశాల పరిస్థితి ఎలా ఉన్నా…కరోనా వైరస్ ను కట్టడి చేసిన క్యూబా అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.

గత 130 రోజుల్లో No New Domestic Covid Cases నమోదు కాలేదని క్యూబా ప్రకటించింది. Francisco Duran, head of epidemiology at the Ministry of Public Health విభాగ అధిపతి డురాన్ ప్రకటన చేశారు. హవానాలో ఓ కేసును గుర్తించినట్లు వెల్లడించారు.

గత వారంలో కొన్ని కోవిడ్ 19 కేసులు నమోదయ్యాయని, ఇవన్నీ హవానాలో ఉన్నాయన్నారు. 11.2 మిలియన్ల ఉన్న క్యూబాలో ఈ వ్యాధి నుంచి విముక్తి పొందినట్లైంది.

ఇప్పటి వరకు ఇంట్లో సురక్షితంగా ఉండాలని తాను ఎప్పుడు చెప్పేవాడినని, కానీ ప్రస్తుతం బీచ్ కు వెళుతారని అనిపిస్తోందని, సామాజిక దూరం మరవద్దని సూచించారు డురాన్. ప్రభుత్వ, ప్రైవేటు రవాణాను ఉపయోగించుకోవచ్చని, బీచ్, ఇతర వినోద కేంద్రాలకు వెళ్లవచ్చన్నారు.

ప్రతి దశలో ఒక్కోటి ప్రారంభమవుతుందని, రెండో దశలో రవాణా స్టార్ట్ అవుతుందని అధికారులు వెల్లడిస్తున్నారు. మూడో దశలో పాఠశాలలు తెరవడం వంటివి ఉన్నాయి. కానీ చాలా సందర్భాల్లో మాత్రం మాస్క్ లు, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని వెల్లడిస్తోంది.

వైరస్ ను అరికట్టడానికి క్యూబా విశేషంగా పని చేసింది. ఆరోగ్య వ్యవస్థ అక్కడ బలంగా ఉండడమే కారణం. ఇంటింటి సర్వే చేపట్టడం ద్వారా..అనారోగ్య వారిని వేరుగా ఉంచడం సాధ్యమైంది. కేవలం 2 వేల 500 కేసులు, 87 మరణాలు సంభవించాయి.

శత్రుదేశంగా భావించిన అమెరికా, ఫ్రాన్స్ జర్మని దేశాలకు క్యూబా వైద్య బృందాలను పంపి తనలో ఉన్న మానవత్వాన్ని బయటపెట్టింది. ప్రతి 100 మందిలో 08 మంది డాక్టర్లు ఉండటంతో…తమ దేశం నుండి ఇతర దేశాలకు వైద్యులను పంపుతోంది.

ప్రతి 1000 మందికి ఏ దేశంలో ఎందరు డాక్టర్లు : క్యూబా 8.2. ఇటలీ 4.1. అమెరికా 2.6. దక్షిణ కొరియా 2.4. చైనా 1.8. భారత్ 0.62

ట్రెండింగ్ వార్తలు