×
Ad

Dad Became Mom: నాన్నా నువ్వు చాలా గ్రేట్.. కూతురి ముఖంలో చిరు నవ్వు కోసం.. తల్లిలా మారిన తండ్రి..

తన గురించి ఎవరేమనుకున్నా తాను పట్టించుకోను అన్నారు. ఇలా మహిళలా రెడీ అయ్యి వచ్చినందుకు తనకేమీ సిగ్గుగా లేదన్నారు.

Dad Became Mom: అమ్మ ప్రేమే కాదు నాన్న ప్రేమ కూడా చాలా గొప్పది. పిల్లల పట్ల తండ్రి చూపించే ప్రేమానురాగాలు, కేరింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తాజాగా ఓ తండ్రి చేసిన పని.. పిల్లలపై నాన్న ప్రేమకు నిదర్శనంగా నిలిచింది. తన కూతురి ముఖంలో చిరు నవ్వు కోసం ఆ నాన్న.. తల్లిలా మారాడు. మహిళలా మేకప్ చేసుకుని స్కూల్ కి వెళ్లాడు. కూతురి సంతోషం కోసం ఆయన చేసిన పని అందరి హృదయాలు గెలుచుకుంది.

థాయ్ లాండ్ లో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అక్కడ లిటిల్ క్రీమ్స్ అనే స్కూల్ ఉంది. ఆ స్కూల్ లో మదర్స్ డే సెలబ్రేషన్స్ చేశారు. పిల్లల తల్లులు అందరూ స్కూల్ కి వెళ్లారు. అయితే, ఆ స్కూల్లో చదువుకునే ఓ అమ్మాయికి తల్లి లేదు. తండ్రి మాత్రమే ఉన్నాడు. దీంతో ఆ అమ్మాయి చాలా బాధ పడింది. మదర్స్ డే సెలబ్రేషన్స్ కి అందరు విద్యార్థులు తమ తల్లిని తీసుకొచ్చారు. తనకు అమ్మ లేకపోవడంతో ఆ అమ్మాయి చాలా ఫీల్ పడింది.

ఇది గమనించిన అమ్మాయి తండ్రి ఒక ప్లాన్ చేశారు. తనే మహిళలా మేకప్ వేసుకున్నారు. మహిళల డ్రెస్ వేసుకుని, విగ్ జట్టు పెట్టుకుని రెడీ అయ్యారు. స్కూల్ లో జరుగుతున్న మదర్స్ డే వేడుకల్లో పాల్గొన్నారు. ఇది చూసిన అమ్మాయి ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యింది. మదర్స్ డే సెలబ్రేషన్స్ లో తన తండ్రిని (తల్లి రూపంలో) చూసి మురిసిపోయింది.

దీనిపై అమ్మాయి తండ్రి జో లుక్ స్పందించారు. తన కూతురి ముఖంలో చిరు నవ్వు కోసమే తానిలా చేశానని చెప్పారు. తన గురించి ఎవరేమనుకున్నా తాను పట్టించుకోను అన్నారు. ఇలా మహిళలా రెడీ అయ్యి వచ్చినందుకు నాకేమీ సిగ్గుగా లేదు, ఎందుకుంటే నేను నా బిడ్డను ప్రేమిస్తున్నా అని జో చెప్పారు. జో చెప్పిన మాటలతో అక్కడున్న వారంతా చప్పట్లు కొట్టారు. యు ఆర్ గ్రేట్ అంటూ కితాబిచ్చారు.

మహిళ వేషధారణలో ఉన్న జో లూప్ తన కూతురితో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు నెటిజన్ల హృదయాలను గెల్చుకున్నాయి. కూతురి ముఖంలో సంతోషం కోసం ఆ తండ్రి చేసిన పనిని అంతా ప్రశంసిస్తున్నారు.

Also Read: ట్రంప్ గోల్డ్ కార్డ్‌తో రూ.9 కోట్లు పెడితే గ్రీన్ కార్డు వచ్చేస్తుందా?