కంటి చూపుకు హోం థెరఫీ.. రెడ్ లైట్‌తో బెటర్ రిజల్ట్

రోజువారీ జీవితంలో లైట్లతోనే ఎక్కువ గడపాల్సిన పరిస్థితులు ఫేస్ చేస్తున్నాం. ఎల్ఈడీల వెలుతురులో బతుకుతూ చిన్న వయస్సులోనే రెటీనా సామర్థ్యాన్ని కోల్పోతున్నాం. ఈ క్రమంలో నిపుణులు మనకు కొన్ని సూచనలు ఇస్తున్నారు. హోం థెరఫీతో కూడా రెటీనాను కాపాడుకోవచ్చని చెబుతున్నారు. రోజుకు మూడు నిమిషాల కంటే ఎక్కువ సేపు రెడ్ లైట్ వెలుతురులో ఉండి కంటి చూపును మెరుగుపరచుకోవచ్చని చెబుతున్నారు.

కొంతమంది వ్యక్తులపై UCL-ledస్టడీ నిర్వహించి విలువైన సలహాలు ఇచ్చారు. జర్నల్స్ ఆఫ్ గెరాంటాలజీలో ఈ కథనాన్ని ప్రచురించారు. కంటి చూపు వృద్ధి చెందేందుకు వాడుతున్న హోం థెరఫీ మిలియన్ల మందికి హెల్ప్ అవుతుంది. లండన్ లోని 12 మిలియన్ మంది 65ఏళ్ల పైబడ్డవారే ఉన్నారు. 50ఏళ్లు ఉన్న వారు 20 మిలియన్ కంటే ఎక్కువ మందే ఉన్నారు. వీరంతా వయస్సు పెరగకపోయినా రెటీనా వయస్సు పెరగడంతో చూపు కోల్పోతున్నారు.

40ఏళ్లు పైబడ్డ వారిలో దాదాపు కంటిచూపు తగ్గిపోవడం మొదలైపోతుంది. మీ రెటీనా సెన్సిటివిటీ, రంగును చూసే దృష్టి సామర్థ్యం రెండూ తగ్గిపోతుంటాయి. దాంతో పాటు వయస్సు పెరగడం కూడా ఒకటి. సుదీర్ఘమైన కాంతి కిరణాలు పడినప్పుడు రెటీనా కణాల్లో కెపాసిటీ పెరిగినట్లుగా అనిపిస్తోంది.

మనుషుల్లో 40ఏళ్లు దాటినప్పటి నుంచి కంటి రెటీనాకు వయస్సు పెరగడం మొదలవుతుంది. కణాల మిటోచోండ్రియా తగ్గిపోయి రెటీనాకు శక్తి పెరిగే స్వభావం కోల్పోవాల్సి వస్తుంది. ఇందులో భాగంగానే 28నుంచి 72 సంవత్సరాల మధ్య వయస్సులో ఉన్న 24మంది(12 పురుషులు, 12 స్త్రీలు)పై స్టడీ నిర్వహించారు.

స్టడీ ఆరంభంలో రాడ్లు, కోన్‌లు పరీక్షలు చేశారు. కాంట్రాస్ట్ తక్కువ ఉన్న రంగు అక్షరాలను కూడా గుర్తు పట్టగలిగారు. కానీ, క్రమంగా బ్లర్ అవడం పెరిగిపోయింది దీనినే కలర్డ్ కాంట్రాస్ట్ అంటారు. కంటి చూపును మెరుగుపరచుకోవడానికి మనం కూడా హోం థెరఫీ వాడొచ్చు. దానికి చేయాల్సిందల్లా ఓ చిన్న ఎల్ఈడీ టార్చ్ తీసుకుని డీప్ రెడ్ 670 నానోమీటర్ల లైట్ బీమ్ వచ్చేలా చూడాలి. రెండు వారాల పాటు రోజుకు మూడు నిమిషాలు ఇలా చేయాలి. అప్పుడు మళ్లీ రాడ్, కోన్ సెన్సిటివిటీని ఎలా చూడగల్గుతున్నారో టెస్ట్ చేసుకోవాలి.

Read:చైనీస్ యాప్స్ భారత్ బ్లాక్ చేసిందని.. ఆందోళనలో డ్రాగన్