Vladimir Putin: పుతిన్ 2 రోజుల భారత పర్యటన.. ఎందుకింత ప్రాధాన్యం సంతరించుకుందంటే?
అజెండాలో ఉండే అంశాల్లో రక్షణ, ఎనర్జీ, చమురు కొనుగోళ్లు, రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వంటివి ఉండనున్నాయి.
- T Venkateshwarlu
- Published On : November 29, 2025 / 03:32 PM IST
Russian President Vladimir Putin
Vladimir Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 4, 5న భారత్‌లో పర్యటించనున్నారు. 23వ ఇండియా-రష్యా వార్షిక సమ్మిట్‌కు హాజరవుతారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ శుక్రవారం ధ్రువీకరించింది. ప్రధాని నరేంద్ర మోదీ గత సంవత్సరం మాస్కోలో జరిగిన సమ్మిట్‌కు హాజరయ్యారు.
“ఈ పర్యటన ఇండియా-రష్యా ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతిని సమీక్షించే అవకాశం ఇస్తుంది. స్పెషల్ అండ్ ప్రివిలిజ్డ్ స్ట్రాటెజిక్ పార్ట్నర్‌షిప్ బలోపేతానికి దిశా నిర్దేశం చేయడానికి, పరస్పర ఆసక్తి గల ప్రాంతీయ, గ్లోబల్ అంశాలపై అభిప్రాయాలను పంచుకునే వేదికగా ఇది నిలుస్తుంది” అని విదేశాంగ శాఖ తెలిపింది.
Also Read: Cyclone Ditwah: 123 మంది ప్రాణాలు తీసిన దిత్వాహ్ తుపాను..
ప్రధాని మోదీ, పుతిన్ ఈ సమ్మిట్‌లో రక్షణ, ఎనర్జీ, ట్రేడ్, ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరుపుతారు. “ఈ పర్యటన అత్యంత ముఖ్యమైనది. రాజకీయం, వాణిజ్య, ఆర్థిక, శాస్త్రీయ, సాంకేతిక, సాంస్కృతి, మానవతా రంగాల్లో ప్రత్యేక ప్రివిలిజ్డ్ స్ట్రాటెజిక్ పార్ట్నర్‌షిప్‌లో రష్యా, భారత సంబంధాల అజెండాను పూర్తిగా చర్చించే అవకాశం ఉంది. అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలను కూడా పరిశీలిస్తుంది” అని క్రెమ్లిన్ (రష్యా అధ్యక్షుడి అధికార నివాస వ్యవస్థ) కూడా పేర్కొంది.
పుతిన్‌ను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వాగతించి, బాంకెట్ హోస్ట్ చేస్తారు. పుతిన్ చివరిసారి భారత్‌కు 2021 డిసెంబర్‌లో వచ్చారు. ఆ తర్వాత ఫిబ్రవరిలో రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైంది.
ఇండియా, రష్యా వార్షిక సమ్మిట్ అజెండాలో ఉండే అంశాల్లో రక్షణ, ఎనర్జీ, చమురు కొనుగోళ్లు, రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వంటివి ఉండనున్నాయి. రష్యా చాలా కాలంగా ఇండియాకు విశ్వసనీయ భాగస్వామిగా ఉంది.
