Dengue Cases : పాక్‌లో డెంగీ విజృంభణ.. పారాసెటమాల్ తీవ్రకొరత.. బ్లాక్ మార్కెట్ డిమాండ్..!

పాకిస్తాన్‌లో డెంగ్యూ జ్వరాలు విజృంభిస్తున్నాయి. రోజురోజుకీ డెంగ్యూ కేసుల పరిస్థితి తీవ్రంగా మారుతోంది.

Dengue Cases Rise in Pakistan : పాకిస్తాన్‌లో డెంగీ జ్వరాలు విజృంభిస్తున్నాయి. రోజురోజుకీ డెంగీ కేసుల సంఖ్య తీవ్రంగా మారుతోంది. ఒకవైపు పాకిస్తాన్‌లో కరోనా 5వ వేవ్ కేసులు.. మరోవైపు డెంగీ కేసులతో పాకిస్తాన్ ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కరోనా, డెంగీ జ్వరాల (Dengue Cases )కు చికిత్స కోసం అధిక మొత్తంలో మందుల కొరత ఏర్పడుతోంది.

ప్రత్యేకించి పాకిస్తాన్ ఫార్మాసీల్లో పారాసెటమాల్ (Paracetamol)  తీవ్ర కొరత ఏర్పడింది. ఎక్కడ చూసినా పార్మాసీల్లో పారాసెటమల్ అందుబాటులో లేదని ఓ నివేదిక వెల్లడించింది. పారాసెటమాల్ కోసం ఎన్ని ఫార్మసీలు తిరిగినా దొరికే పరిస్థితి లేకుండా మారిపోయిందని తెలిపింది. అత్యవసర పరిస్థితిని తలపించేలా అక్కడి ఫార్మాసీల్లో పారాసెటమాల్ తీవ్ర కొరతను ఎదుర్కొంటున్నాయి.

డెంగీ కేసులు పెరిగేకొద్ది పారాసెటమాల్ (Paracetamol Uses) వినియోగం కూడా భారీగా పెరిగిపోతోంది. ఫలితంగా పారాసెటమాల్ కొరత ఏర్పడినట్టు DAWN నివేదిక పేర్కొంది. పాక్‌లోని చాలా ఫార్మసీలలో పారాసెటమాల్ అందుబాటులో లేదని, ఇప్పుడంతా బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్నట్లు DAWN నివేదించింది.

కోవిడ్‌ బాధితులకు  (Covid Victims) సాధారణంగా సూచించే మందుల్లో పారాసెటమాల్‌ ఒకటి.. అయితే ఇప్పుడా పారాసెటమాల్ తీవ్ర కొరతను పాక్ ఎదుర్కొంటోంది. డెంగీ కేసులు భారీగా పెరిగిపోవడం వల్ల పారాసెటమాల్ కొరత తీవ్రంగా ఉందని అధికారులు చెబుతున్నారు. పెయిన్ క్లిలర్‌గా వాడే పారాసెటమాల్‌కు డెంగీ కేసుల పెరగడంతో భారీ డిమాండ్ ఏర్పడిందని డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ పాకిస్థాన్ (Drap) అధికారి ఒకరు వెల్లడించారు. పారాసిటమాల్‌ తయారీలో విఫలమైన 15 ఫార్మా కంపెనీలకు ఇప్పటికే (Drap) షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది.

మరోవైపు.. పాకిస్తాన్ ప్రస్తుతం కోవిడ్ ఐదో వేవ్‌ను ఎదుర్కొంటోంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య లక్ష మార్కును దాటింది. పాకిస్థాన్ జాతీయ పాజిటివిటి రేటు 9.65 శాతంగా నమోదైంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కరోనా 32 మరణాలను నమోదైనట్టు నేషనల్ కమాండ్ ఆపరేషన్ సెంటర్ (NCOC) ఒక ప్రకటనలో వెల్లడించింది.

Read Also : India Covid Update : దేశంలో కొత్తగా 1,61,386 కోవిడ్ కేసులు నమోదు

ట్రెండింగ్ వార్తలు