×
Ad

Trump Dance : మలేషియాలో డ్యాన్స్ చేసిన డొనాల్డ్ ట్రంప్.. వీడియో వైరల్.. అక్కడ ఏం జరిగిందంటే?

Trump Dance ఆసియన్ సదస్సులో పాల్గొనేందుకు ట్రంప్ దాదాపు 23 గంటల పాటు విమాన ప్రయాణం అనంతరం మలేసియా రాజధాని కౌలాలంపూర్ చేరుకున్నారు.

Trump Dance

Trump Dance : ఆసియన్ సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మలేసియా వెళ్లారు. ఆసియన్ దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకునేందుకు ట్రంప్ ఈ పర్యటన చేపట్టారు. అయితే, ఈ సదస్సుకు జపాన్ కొత్త ప్రధాని తకాయిచి, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, దక్షిణ కొరియా నేతలు కూడా హాజరు కానున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో ప్రసంగించనున్నారు.

ఆసియన్ సదస్సులో పాల్గొనేందుకు ట్రంప్ దాదాపు 23 గంటలపాటు విమాన ప్రయాణం అనంతరం మలేసియా రాజధాని కౌలాలంపూర్ చేరుకున్నారు. ఎయిర్ పోర్స్ వన్ నుంచి కిందకు దిగగానే ఆయనకు ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఘనంగా స్వాగతం పలికారు. దాంతోపాటు అక్కడి సాంప్రదాయ నృత్యం చేస్తూ కొందరు ట్రంప్‌కు వెల్కమ్ పలికారు. దీంతో ట్రంప్ సైతం వారితోపాటు నృత్యం చేశాడు. తనదైన శైలిలో డ్యాన్స్ చేస్తూ ట్రంప్ అందరిని ఉత్సాహపర్చాడు. పక్కనే ఉన్న మలేషియా ప్రధాని కూడా ట్రంప్ ను అనుసరిస్తూ స్టెప్పులు వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


ట్రంప్ డ్యాన్స్ కు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఓ నెటిజన్.. ట్రంప్ మళ్లీ డ్యాన్స్ ను గొప్పగా చేస్తున్నారు అని పేర్కొనగా.. మరో నెటిజన్ ఆ క్షణాన్ని వినోదాత్మకంగా, చిరస్మరణీయంగా అభివర్ణించాడు. మరికొందరు ట్రంప్ డ్యాన్స్ సూపర్ అంటూ కితాబు ఇస్తూ కామెంట్లు చేశారు. ట్రంప్ డ్యాన్స్ చేయడం ఇదేం కొత్తకాదు.. ఎన్నికల ప్రచారం వేళ ట్రంప్ స్టెప్పులు బాగా పాపులర్ అయ్యాయి. తాజాగా.. మలేషియాలో ఫ్లైట్ దిగిన వెంటనే ఆయన డ్యాన్స్ చేయడం విశేషం..