కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ అయిపోయిన అమెరికాను రీఓపెన్ చేయడం ద్వారా ఎక్కువమంది అమెరికన్లు ప్రాణాలు కోల్పోయే అవకాశముందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించారు. సోషల్ డిస్టెన్స్ చర్యలను ఎత్తివేయడం మరియు మూసివేసిన ఆర్థిక వ్యవస్థను తిరిగి తెరవడం అధిక మరణాల సంఖ్యకు దారితీస్తుందా అని ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా…కొన్ని ఉండవచ్చు అని,ఎందుకంటే మీరు ఓ అపార్ట్మెంట్ లేదా ఇంట్లో లేదా మరేదైనా చోట లాక్ చేయబడి ఉండరని అమెరికా అధ్యక్షుడు అన్నారు.
కొంతమంది అమెరికన్లు తీవ్రంగా ప్రభావితమవుతారని,అయినప్పటికీ అమెరికాను తిరిగి ఓపెన్ చేయాలని ట్రంప్ అన్నారు. ముందుకుసాగాల్సిన సమయం వచ్చిందని ట్రంప్ అన్నారు. తాను చీర్ లీడర్ అవ్వాలనుకుంటున్నట్లు అధ్యక్షుడు తెలిపారు. అగ్రరాజ్యంలో కరోనావైరస్ లాక్ డౌన్ ప్రారంభమైనప్పటి నుండి దేశంలో ఎక్కడా పర్యటించని ట్రంప్..తొలిసారిగా మంగళవారం తన మొదటి ప్రధాన పర్యటనలో భాగంగా అరిజోనా రాష్ట్రంలోని ఫీనిక్స్ సిటీలో మాస్క్ లు తయారుచేసే హనీవెల్ ఫ్యాక్టరీలో ట్రంప్ పర్యటించారు.
అయితే మాస్క్ ల కర్మాగారంలో పర్యటించినప్పటికీ, ఫేస్ మాస్క్ ధరించడానికి మాత్రం ట్రంప్ నిరాకరించారు. మెడికల్ స్టాఫ్,కరోనా పోరాటంలో ముందువరుసలో నిలబడినవారు ఉపయోగించే మాస్క్ లను తయారుచేస్తున్నహనీవెల్ కార్మికులను ట్రంప్ ప్రశంసించారు. ముందుకుసాగాల్సిన సమయం వచ్చిందని ట్రంప్ అన్నారు. హనీవెల్ వద్ద ట్రంప్ ఆడియన్స్…. అమెరికా ప్రభుత్వ సిఫార్సులు మరియు వారి స్వంత కంపెనీ నిబంధనలకు అనుగుణంగా మాస్క్ వేసుకుని కూర్చున్నారు. “దయచేసి మీ మాస్క్ ను అన్ని సమయాల్లో ధరించండి”అని ఒక సంకేతంగా ఇది నిలిచింది. అయితే ట్రంప్ మాత్రం మాస్క్ ధరించేందుకు నిరాకరించాడు.
మొదటి నుండి ట్రంప్ మాస్క్ ధరించడం పట్ట నిరాశక్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కరోనా వైరస్ వ్యాప్తికి వ్యతిరేకంగా మాస్క్ ను… కీలకమైన సాధనంగా వైట్ హౌస్ వైద్య నిపుణులు మరియు ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ ప్రోత్సహిస్తున్నారు. “నేను అధ్యక్షులు, ప్రధానమంత్రులు, నియంతలు, రాజులు, రాణులను పలకరించేటప్పుడు ఫేస్ మాస్క్ ధరించడం నాకు తెలియదు” అని ఏప్రిల్‌లో ట్రంప్ అన్నారు. మాస్క్ ధరించడం అప్రధానమైనదిగా, ఏదో..నా కోసం నేను చూడను అని ఆ సమయంలో ట్రంప్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
కాగా, గత వారం అమెరికా వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ కూడా… రోచెస్టర్ లోని ప్రముఖ మాయో క్లీనిక్ హాస్పిటల్ ను సందర్శించిన సమయంలో మాస్క్ ధరించని విషయం తెలిసిందే. బయటనుంచి హాస్పిటల్ కు సందర్శకులు వచ్చినప్పడు మాస్క్ లు ధరించాల్సి ఉన్నప్పటికీ ఆయన మాస్క్ ధరించకుండా హాస్పిటల్ లో తిరిగిన ఫొటోలు వైరల్ గా మారాయి. తన ఫోటోలు వైరల్ అయిన తర్వాత మైక్ పెన్స్ తన తప్పు ఒప్పుకున్నారు.
మైక్ స్పందిస్తూ…నేను ఇది అవసరమైనదని అనిఅనుకోలేదు. కానీ నేను మాస్క్ ధరించాల్సి ఉండాల్సింది అని ఆదివారం ఆయన అన్నారు. ఆ తర్వాత వేరే ట్రిప్ లో ఆయన మాస్క్ ధరించారు. కరోనావైరస్ కోసం ఉన్నత అధికారులు మరియు వారి అతిథులు తరచూ పరీక్షించబడుతున్నందున వారు సాధారణంగా మార్గదర్శకాన్ని పాటించాల్సిన అవసరం లేదని వైట్ హౌస్ చెబుతోంది. మరోవైపు ఇప్పటివరకు అమెరికాలో 12లక్షల 37వేల 761మందికి కరోనా సోకగా,72వేల275మంది ప్రాణాలు కోల్పోయారు. 2లక్షల 669మంది కోలుకున్నారు. కాగా,అమెరికాలో దాదాపు లక్ష మంది వరకు చనిపోయే అవకాశం ఉందని అధ్యక్షుడు ట్రంప్ అంచనా వేశారు.
Also Read | H-1B వీసాదారులు,గ్రీన్ కార్డు దరఖాస్తుదాలకు ట్రంప్ గుడ్ న్యూస్