Donald Trump: డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. కీలక ఉత్తర్వులపై సంతకం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం అమలు దిశగా అడుగు వేశారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టి నాటినుంచి..

Donald Trump

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా టారిఫ్ ల విషయంపై పలు దేశాలతో కయ్యానికి కాలుదువ్విన ట్రంప్.. మరోవైపు అధికారంలోకి వచ్చిన నాటినుంచి ప్రభుత్వ వ్యయం తగ్గింపుపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో ఆయన సంచలన ఉత్తర్వులపై ఆయన సంతకం చేశారు.

 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం అమలు దిశగా అడుగు వేశారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టి నాటినుంచి విద్యాశాఖలో భారీగా ఉద్యోగాల్లో కోతలు విధించిన విషయం తెలిసిందే. తాజాగా.. అమెరికా విద్యాశాఖ మూసివేత ఉత్తర్వులపై సంతకం చేశారు. గురువారం వైట్ హౌజ్ లోని ఈస్ట్ రూమ్ లో స్కూల్ పిల్లల మధ్య డొనాల్డ్ ట్రంప్ కూర్చుని ఈ ఉత్తర్వులపై ప్రత్యేక వేడుకలో సంతకం చేయడం గమనార్హం. ఈ కార్యక్రమానికి రిపబ్లికన్ లీడర్లు, పలు రాష్ట్రాల గవర్నర్లు హాజరయ్యారు.

 

ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘నాలుగు దశాబ్దాలుగా భారీగా ఖర్చు చేస్తున్నా అమెరికాలో విద్యా ప్రమాణాలు మెరుగుపడటం లేదని, ఇంకా యూరప్ దేశాలు, చైనా కంటే వెనుకబడే ఉన్నామని, కాబట్టే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ట్రంప్ వెల్లడించారు. అయితే, విద్యార్థులకు ఫీజుల రాయితీలు, కొన్ని ముఖ్యమైన పథకాలను కొనసాగిస్తామంటూ’’ చెప్పారు.


ట్రంప్ తాజా నిర్ణయం అమల్లోకి రావడం అంత సులువు కాదని తెలుస్తోంది. కారణం ఏమిటంటే.. అందుకు పార్లమెంట్ అనుమతి తప్పనిసరి. అయితే, ట్రంప్ మాత్రం వీలైనంత త్వరలోనే ఈ ఉత్తర్వులు అమల్లోకి తీసుకొస్తామని చెబుతున్నారు.