మోడీకి మాటిచ్చా.. భారత్ వస్తున్నా మిత్రమా!

  • Publish Date - February 24, 2020 / 03:31 AM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోసం భారత్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. లక్షల మంది ప్రజలతో ట్రంప్ ఫ్యామిలీకి స్వాగతం పలికేందుకు ఇండియా రోడ్ షో ఎదురుచూస్తోంది. తొలిసారి కుటుంబ సమేతంగా భారత్ కు వస్తున్న అమెరికా అధ్యక్షుడికి అహ్మదాబాద్ నగరం నమస్తే ట్రంప్ అంటూ స్వాగతం పలుకుతోంది. మోతెరా స్టేడియం కూడా ముస్తాబు అయింది.

అమెరికాతో కలిసి ఇరుదేశాల మధ్య ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ఢిల్లీ నగరం వేదిక అవుతోంది. రెండు రోజుల పర్యటనలో ట్రంప్ ఫ్యామిలీ సహా అమెరికా అధికారుల బృందానికి భారత సంస్కృతి ఔనత్యాన్ని చాటిచెప్పనున్నారు. అహ్మదాబాద్ లో ప్రధాని నరేంద్ర మోడీనే స్వయంగా స్వాగతం పలకనున్నారు. వాషింగ్టన్ నుంచి బయల్దేరిన ట్రంప్ ఫ్యామిలీ సోమవారం నేరుగా అహ్మదాబాద్ చేరుకోనుంది. 

అక్కడి నుంచి ఆగ్రా, ఢిల్లీలలో దాదాపు 36 గంటల పాటు ట్రంప్ పర్యటన సాగనుంది. ఇందుకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రంప్, మోడీకి మధ్య స్నేహాన్ని మరింత పటిష్టం చేయడానికే ఈ పర్యటన సహకరిస్తుందని రెండు దేశాలు భావిస్తున్నాయి. భారత్ పర్యటన సందర్భంగా డొనాల్డ్ ట్రంప్.. గొప్ప స్నేహితులను కలిసే తరుణం కోసమే ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.. ప్రధాని నరేంద్ర మోడీ నాకు మంచి స్నేహితుడు. భారత్ పర్యటనకు వెళ్లాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా.

మోడీకి వస్తానని మాటిచ్చి చాలా రోజులైపోతోంది. ఎప్పటికప్పుడూ రావాలని అనుకుంటూనే ఎన్నో రోజులు గడిచిపోయాయి. ఇన్నేళ్లకు భారత్ రావాలనే ఆకాంక్ష నెరవేరింది. వస్తున్నా.. మోడీ మిత్రమా.. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా? అంటూ కుటుంబసమేతంగా ట్రంప్ భారత్ వస్తున్నాడు.. ఆయన రాక కోసం భారత్ నమస్తే.. ట్రంప్ అంటూ లక్షల కన్నులతో ఎదురుచూస్తోంది. 

Read More>> Indian Idol 11 winner సన్నీ హిందూస్తానీ