Dubai govt lifted 30 percent tax on alcohol
Dubai govt lifted 30 percent tax on alcohol : కొత్త సంవత్సరంలో దుబాయ్ ప్రభుత్వం లిక్కర్ ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పింది. మద్యంపై 30 శాతం పన్ను ఎత్తివేసింది దుబాయ్ ప్రభుత్వం. దుబాయ్,అబుదాబి లాంటి గల్ఫ్ దేశాలు పర్యాటకులకు స్వర్గధామంగా విరాజిల్లుతున్నారు. ఎంతోమంది టూరిస్టులు గల్ఫ్ దేశాలు వస్తుంటారు. పర్యాటకులను ఆకర్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఓ పక్క చమురు నిల్వలు, మరోపక్క పర్యాటకుల సందర్శనతో భారీ ఆదాయం సమకూరుతుంటుంది ఈ గల్ఫ్ దేశాలకు. పర్యాటకుల సౌకర్యార్థం గల్ఫ్ దేశాలు ఎన్నో సౌకర్యాలు కల్పిస్తుంటాయి. ఎన్ని సౌకర్యాలు ఉన్నా గల్ఫ్ దేశాల్లో ఇస్లామిక్ చట్టాలు అమలు కఠినంగా ఉంటాయి. ఈ నిబంధనలతో టూరిస్టులు కాస్త అసౌకర్యానాకి గురి అవుతుంటారు. ఈ విషయం గ్రహించిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కొన్ని నిబంధనలను సడలిస్తూ వస్తోంది.
దీంట్లో భాగంగానే పర్యాటకులను మరింతగా ఆకర్షించటానికి తాజాగా మద్యం విక్రయాలపై నిబంధనలు సడలించింది. మద్యంపై విధిస్తున్న 30 శాతం పన్ను కూడా ఎత్తివేసింది. ఈ నిర్ణయానికి ముందు అరబ్ దేశాల్లో ఇంట్లో మద్యం సేవించాలన్నా ప్రభుత్వానికి పన్ను చెల్లించాల్సి వచ్చేది. అంతేకాదు ఇంట్లో మద్యం తాగాలన్నా వ్యక్తిగత లైసెన్స్ తీసుకోవాల్సి వచ్చేది. మద్యం విషయంలో చట్టాలను సవరిస్తూ జనవరి 1న దుబాయ్ రాజ కుటుంబం ఈ ప్రకటన చేసింది. విదేశీ పర్యాటకులను మరింత ఆకర్షించేందుకు మద్యంపై ట్యాక్స్ తగ్గించింది. ఇప్పుడు ఈ చట్టాలను సవరించడంతో పాటు మద్యం ధరలు కూడా తగ్గించింది. దాంతో, విదేశీ పర్యాటకులకు ఊరట కలుగుతుందని గల్ఫ్ దేశం భావిస్తోంది.
కాగా విదేశీ పర్యాటకులు దుబాయ్ కు భారీగా తరలివస్తుంటారు. పొరుగున ఉన్న గల్ఫ్ దేశాలతో పోలిస్తే UAEలో మద్యం విక్రయాలు ఇప్పటికే మరింత సరళీకృతం చేయబడ్డాయి. వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం కౌన్సిల్ డేటా ప్రకారం..2022లో అంతర్జాతీయ సందర్శకులు దుబాయ్‌లో 29 బిలియన్ల డాలర్ల కంటే ఎక్కువ ఖర్చు చేశారు. సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ గ్లోబల్ బిజినెస్‌లు, టాలెంట్,టూరిజంను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు.