Paperless Dubai: ప్రపంచంలోనే తొలి కాగిత రహిత దేశంగా దుబాయ్

పర్యావరణ హితం కోరే పనుల్లో ఒకటైన కాగితరహిత కార్యకలాపాల్లో దుబాయ్ నెం.1 స్థానంలో నిలిచింది. ప్రపంచంలోనే ఇలాంటి ఘనత దక్కించుకున్న తొలి దేశం దుబాయ్ మాత్రమే. ఎమిరేట్స్ యువరాజు..

Paperless Dubai: పర్యావరణ హితం కోరే పనుల్లో ఒకటైన కాగితరహిత కార్యకలాపాల్లో దుబాయ్ నెం.1 స్థానంలో నిలిచింది. ప్రపంచంలోనే ఇలాంటి ఘనత దక్కించుకున్న తొలి దేశం దుబాయ్ మాత్రమే. ఎమిరేట్స్ యువరాజు షేక్ హమ్‌దాన్ బిన్‌ మొహ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మఖ్తుమ్‌ ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.

ఫైల్స్‌ బదిలీలు, అంతర్గత, బహిర్గత లావాదేవీలన్నింటినీ కాగితం ఉపయోగించకుండా డిజిటలైజ్‌గా జరిపిస్తున్నట్లు తెలిపారు. ఇలా చేయడం ద్వారా 350 మిలియన్‌ యూఎస్‌ డాలర్లు, 1.40లక్షల పని గంటలు ఆదా చేసినట్లు పేర్కొన్నారు.

‘ఈ లక్ష్యం సాధించడం మరికొన్నింటికి ప్రేరణగా మిగిలింది. దుబాయ్‌ నిత్య జీవితంలోని ఇంకొన్ని అంశాలను డిజిటలైజ్‌ చేయడానికి నాంది పలికినట్లుగా భావిస్తున్నామని అధికారులు అంటున్నారు. ఆవిష్కరణ, సృజనాత్మకత, భవిష్యత్‌పై దృష్టి సారించే ప్రయాణమిది’ అని యువరాజు షేక్‌ హమ్‌దాన్‌ వ్యాఖ్యానించారు.

,.,.,.,.,.,.,.,.,.,.,.,.,.,.,.,.,.,.,.,.,.,.,.,.,.,. : ఫలాలే కాదు వాటి ఆకులు ఆరోగ్యానికి మేలు చేస్తాయ్!…

దుబాయ్ ప్రభుత్వం డిజిటల్‌ సేవల కోసం ‘దుబాయ్‌ నవ్‌’ యాప్‌ను రూపొందించింది. యునైటెడ్‌ అరబ్‌ ఎమరేట్స్‌(యూఏఈ) మొత్తం కాగితరహితంగా మార్చేందుకు 5 దశల విధానాన్ని అమలు చేస్తున్నారు. పౌరులకు ఇందులో 12 కేటగిరిల్లో 130 స్మార్ట్‌ సిటీ సేవలు అందుబాటులో ఉంటాయి. అలా మొదట దుబాయ్‌ కాగితరహిత ప్రభుత్వంగా అవతరించింది.

ట్రెండింగ్ వార్తలు