Fruits Leaves : ఫలాలే కాదు వాటి ఆకులు ఆరోగ్యానికి మేలు చేస్తాయ్!…

మామిడి ఆకుల్లో చాలా సైన్స్ దాగుంది కాబట్టే వేల సంవత్సరాలుగా మన ఇంటి గుమ్మాలకు తోరణాలుగా కట్టుకోవడం సంప్రదాయంగా ఉంటూ వస్తోంది.

Fruits Leaves : ఫలాలే కాదు వాటి ఆకులు ఆరోగ్యానికి మేలు చేస్తాయ్!…

Fruits Leaves

Fruits Leaves : ఫలాలు ప్రకృతి ప్రసాదించిన ఆరోగ్యవరాలు, ఇవి సహజమైన మందులు. వీటలో ఎన్నో ఔషథగుణాలు న్నాయి. మందుల కన్నావీటి ఖర్చుతక్కువ. శరీరానికి శక్తిని అందించడంలో పండ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిలో ఉండే పీచు పదార్థం శరీర అవసరాలను తీర్చడంతోపాటు, సహజసిద్ధమైన రీతిలో చక్కెరను మెయింటెయిన్ చేయడంలో సహాయపడుతుంది.

అయితే ఈ పండ్లు మాత్రమే కాదు, వాటి ఆకులు కూడా ఆరోగ్యాన్ని, అందాన్ని కాపాడుకోవడానికి ఉపయోగపడతాయని చాలా మందికి తెలియదు. ఏ పండ్ల ఆకులు మనకు ఎలా ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

జామ ఆకులు ; జామ కాయలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఇందులో పోషకాలు, విటమిన్స్ అధికంగా ఉండడం వలన శరీరంలోని అనారోగ్య సమస్యలను తగ్గించడమే కాకుండా.. ఆరోగ్యంగా ఉంచుంతుంది. కేవలం జామ కాయలతో మాత్రమే కాకుండా.. జామ ఆకులతో కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.జామ ఆకులను వేడి నీటిలో వేసి తాగడం వలన సీజనల్ వ్యాధులు తగ్గడమే కాకుండా.. చర్మ సమస్యలను కూడా తగ్గిస్తుంది. అయితే ఈ జామ ఆకులతో జుట్టు సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు. వీటిని వాడడం వలన జుట్టు నల్లగా, మందంగా , పొడవుగా, మృదువగా ఉంటుంది. ఇందులో ఉండే పాలీఫెనాల్స్ కార్బోహైడ్రేట్లను నియంత్రిస్తాయి. జామ ఆకులతో చేసిన టీ.. రక్తంలోని చక్కెరను నియంత్రిస్తుంది. ఈ టీ డయేరియాను నయం చేయడంలో ఎంతగానో సహాయపడుతుంది.

అరటి ఆకులు ; ఎండిన అరటి ఆకులతో తయారు చేసిన టీ తాగడం వల్ల గొంతు నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. అరటి ఆకుల పేస్ట్‌ను అప్లై చేయడం వల్ల మొటిమలు నయమవుతాయి. వింటర్ సీజన్‌లో చుండ్రును తొలగించడానికి, అరటి ఆకుల గుజ్జును జుట్టుకు పట్టించి, అరగంట తర్వాత తల స్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే చుండ్రు పూర్తిగా తొలగిపోతుంది. అరటి ఆకులో వడ్డించిన ఆహారం ఆరోగ్యకరమైనదిగా గుర్తించారు. అరటి ఆకులో వేడి ఆహారం వడ్డించటం వలన ఆకులో ఉన్నముఖ్యమైన పోషకాలు ప్రసరిస్తాయి మరియు ఆహారంలో కలుస్తాయి. శరీరంపైన కాలిన బొబ్బలమీద అల్లం నూనె వేసి దాని పైన అరటిఆకుతో మూసి, ఆకుపైన మరల అల్లంనూనేను వేసినట్లయితే, వేడి మరియు దాని కాలినబొబ్బలను తగ్గిస్తుంది.

మామిడి ఆకులు ; మామిడి ఆకుల్లో చాలా సైన్స్ దాగుంది కాబట్టే వేల సంవత్సరాలుగా మన ఇంటి గుమ్మాలకు తోరణాలుగా కట్టుకోవడం సంప్రదాయంగా ఉంటూ వస్తోంది. మామిడి ఆకుల వలన కలిగే ప్రయోజనాల గురించి దాదాపు మనలో చాలా మందికి అవగాహన లేదు. పోషకాలను కలిగి ఉండే మామిడి ఆకులు ఫినోలిక్ సమ్మేళనాలు మరియు ఫ్లావనాయిడ్ లను అధిక మొత్తంలో కలిగి ఉంటాయి. వివిధ రకాల రుగ్మతలను తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉండే మామిడి ఆకులను ఆయుర్వేద వైద్యశాస్త్రంలో వాడతారు. మామిడి ఆకులు బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది. బ్లడ్ ప్రెజర్ కు కారణమయ్యే హైపర్ టెన్షన్ తగ్గిస్తుంది. రోజూ ఒక కప్పు మ్యాంగో లీవ్స్ టీ తాగడం వల్ల హైపర్ టెన్షన్ తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు. మామిడి ఆకుల్లో ఉండే టానిన్స్, యాంతో సైనిన్స్ డయాబెటిస్ ను నివారించడంలో అద్భుతంగా సహాయపడుతుందని , అలాగే వ్యాస్కులర్ రిలేటెడ్ సమస్యలను కూడా నివారిస్తుందని సూచిస్తున్నారు.

దానిమ్మ ఆకులు ; దానిమ్మ ఆకులతో ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి. అనేక ఆనారోగ్య సమస్యలను ఈ ఆకులతో చెక్ పెట్టవచ్చు. ఆయుర్వేద వైద్యంలో వీటిని ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా చలికాలంలో జలుబు, దగ్గు, సమస్యతో బాధపడుతున్నవారు. గుప్పెడు దానిమ్మ ఆకులను తీసుకుని బాగా కడిగి తగినన్ని నీళ్ళు తీసుకుని బాగా మరిగించుకోవాలి. ఈనీటిని ఉదయం సాయంత్రం తీసుకుంటే జలుబు, దగ్గు తగ్గిపోతాయి. కిడ్నీ, లివర్, వాంతులు, అరుగుదల సమస్యలు ఉన్నవారు దానిమ్మ ఆకులను సేకరించి నీడలో ఆరబెట్టుకోవాలి. ఆతరువాత దానిని పొడిగా చేసుకుని రోజుకు మూడు గ్రాముల చొప్పున తీసుకోవటం వల్ల సమస్యలను తగ్గించుకోవచ్చు. అధికబరువుతో బాధపడుతున్న వారు దానిమ్మ ఆకులతో తయారు చేసుకున్న టీని తాగటం వల్ల మంచి ఫలితం పొందవచ్చు. కడుపునొప్పి, కడుపులో వికారం వంటి సమస్యలను తగ్గించటంలో దానిమ్మ ఆకుల టీ బాగా పనిచేస్తుంది. చెవినొప్పి, చెవిలో ఇన్ఫెక్షన్ ఉంటే దానిమ్మ ఆకుల రసాన్ని తీసి నువ్వుల నూనె వేసి మరగించాలి. చల్లారిన తరువాత రెండు చెవ్వుల్లో రెండు చుక్కలు వేయడం వల్ల చెవినొప్పి, ఇన్ఫెక్షన్ తగ్గుతాయి.