చైనా : ఎలక్ట్రానిక్ పరికరాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా ఉండాలి. లేదంటే ప్రాణాలకే ప్రమాదం. ఇలాంటి ఘటన ఒకటి చైనాలో జరిగింది. ఈ-బైక్ పేలి 5 మంది చనిపోయారు.
చైనా : ఎలక్ట్రానిక్ పరికరాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా ఉండాలి. లేదంటే ప్రాణాలకే ప్రమాదం. ఇలాంటి ఘటన ఒకటి చైనాలో జరిగింది. ఈ-బైక్ పేలి 5 మంది చనిపోయారు. 38మంది గాయపడ్డారు. గాంగ్జి జువాంట్ అటానమస్ ప్రాంతంలో ఆదివారం (మే 5,2019) ఈ ఘోరం జరిగింది. గ్యూలిన్ లోని ఓ అపార్ట్ మెంట్‌లో నివసించే వ్యక్తి.. విద్యుత్‌తో నడిచే తన ఈ-బైక్‌కు చార్జింగ్ పెట్టి బయటకు వెళ్లాడు. ఏం జరిగిందో తెలియదు కానీ.. బైక్ నుంచి ఒక్కసారిగా పొగలు వచ్చాయి. తర్వాత మంటలు చెలరేగాయి. చూస్తుండగానే పేలిపోయింది.
మంటలు మిగతా ఇళ్లకూ వ్యాపించాయి. ఈ ఘటనలో ఐదుగురు చనిపోయారు. 38మందికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ-బైక్ పేలిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. ఈ-బైక్ పేలి 5మంది చనిపోవడం.. ఈ-బైక్ లు వాడే వారిలో ఆందోళన నింపింది. ఈ-బైక్ లు సురక్షితమా కాదా అనే సందేహాలు నెలకొన్నాయి. అసలు వాటిని వాడాలా వద్దా అనే సందిగ్ధంలో పడిపోయారు.
Don’t leave your charging e-bike unattended! Or it could end up like this: A fire reportedly caused by an e-bike killed 5 people and injured 38 others on Sunday at a residential building in Guilin, S China’s Guangxi Zhuang Autonomous Region. pic.twitter.com/VScpZS5v2G
— People’s Daily, China (@PDChina) May 5, 2019