Earthly Life Could Survive On Mars : అంగారకుడిపై మనుగడ సాధ్యమేనా? భూమిపై జీవించినట్టే మార్స్ గ్రహంపై కూడా మనుషులు మనుగడ సాగించగలరా? అంటే సాధ్యమే అంటోంది కొత్త అధ్యయనం.. ఎందుకంటే.. అంగారకుడిపై ఉండే వాతావరణం దాదాపు భూమిపై ఉండే వాతావరణం మాదిరిగానే ఉంటుందని అంటున్నారు. వాతావరణం చల్లగానూ, పొడిగా ఉండే అంగారకుడి ఉపరితలంపై అతినీలలోహిత కాంతిని ప్రసరిస్తుంటుంది. వాస్తవానికి అక్కడ జీవం ఉందో లేదో మిస్టరీగానే ఉంది. రెడ్ ప్లానెట్ పై ఒకప్పుడు జీవం ఉండేదని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ అధ్యయనాల ప్రకారం.. భూమిపై జీవించే జీవులు అంగారకుడిపై తాత్కాలికంగా మనుగడ జీవించగలవని చెబుతున్నాయి.
అంగారకుడి మట్టిపై సూక్ష్మజీవులు :
పరిశోధకులు మార్టిన్ ఉల్క నుండి పొందిన మట్టిపై సూక్ష్మజీవులను పెంచారు. ఈ బృందం ఉల్క నార్త్‌వెస్ట్ ఆఫ్రికా (NWA) 7034ను ఉపయోగించింది. 4.5 బిలియన్ ఏళ్ల నాటి అంగారక గ్రహానికి చెందిన ఒక ముక్క భాగం. రెడ్ ప్లానెట్‌పై ప్రారంభ ఏళ్లలో కెమోలిథోట్రోఫ్స్‌తో సమానమైన జీవం ఉందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఈ కెమోలిథోట్రోఫ్‌లు ఇనుము, మాంగనీస్ అల్యూమినియం ఫాస్ఫేట్‌లతో తయారైన ఖనిజ గుళికలు ఉన్నాయని బృందం కనుగొంది.