×
Ad

Philippines Earthquake : ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం.. కుప్పకూలిన భవనాలు.. రోడ్లపైకి పరుగులు తీసిన ప్రజలు.. వీడియోల్లో భయానక దృశ్యాలు..

Earthquake : దక్షిణ ఫిలిప్పీన్స్ లోని మిండనోవా ద్వీపంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.6గా నమోదైంది.

Earthquake

Earthquake : దక్షిణ ఫిలిప్పీన్స్ లోని మిండనోవా ద్వీపంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.6గా నమోదైంది. మనీలాకు ఆగ్నేయాన 62 కిలోమీటర్ల దూరంలోని సముద్రంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. భారీ భూకంపం ధాటికి పసిఫిక్ తీరంలో భారీగా అలలు ఎగిసిపడుతున్నాయి. దీంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు.

భూకంప తీవ్రతతో పలు భవనాలు కుప్పకూలాయి. ఇండ్లలోని ప్రజలు భయంతో ప్రాణాలు కాపాడుకునేందుకు రోడ్లపైకి పరుగులు తీశారు. ఇందుకు సంబంధించి భయానక దృశ్యాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.