Mexico Earthquake : 5.7 తీవ్రతతో మెక్సికోలో భూకంపం

భూకంపం ఈ పేరు వింటేనే ప్రపంచదేశాలు వణికిపోతున్నాయి. టర్కీ, సిరియాల్లో వరుస భూకంపాలు వేలాది ప్రాణాల్ని బలితీసుకున్న విషాదాలు కొనసాగుతున్న వేళ మెక్సికోను భూకంపం వణికించింది. రిక్కర్ స్కేల్ పై 5.7గా నమోదు అయిన ఈ భూకంపంతో మెక్సికో వాసులు వణికిపోయారు.

Mexico Earthquake : భూకంపం ఈ పేరు వింటేనే ప్రపంచదేశాలు వణికిపోతున్నాయి. టర్కీ, సిరియాల్లో వరుస భూకంపాలు వేలాది ప్రాణాల్ని బలితీసుకున్న విషాదాలు కొనసాగుతున్న వేళ మెక్సికో (Mexico)ను భూకంపం వణికించింది. రిక్కర్ స్కేల్ పై 5.7గా నమోదు అయిన ఈ భూకంపంతో మెక్సికో వాసులు వణికిపోయారు. బుధవారం (మార్చి2,2023) తెల్లవారుజామున మెక్సికో (Mexico)లోని ఓక్సాకా (Oaxaca) ప్రాంతంలో భూకంపం సంభవించింది.

రిక్టర్‌ స్కేలుపై భూకంపం తీవ్రత 5.7గా నమోదైనట్లు యూరోపియన్‌ మెడిటరేనియన్‌ సిస్మోలాజికల్‌ సెంటర్‌ (European Mediterranean Seismological Centre) వెల్లడించింది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు ఈఎంఎస్‌సీ (EMSC) వెల్లడించింది. ఈ భూకంపం వల్ల జరిగిన ఆస్తి, ప్రాణ నష్టంపై ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం అందలేదు. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏమైందో ఏమిటో ఒక్కసారిగా ఏమి తెలియలేదు. భూకంపం అని తెలియగానే నివాసాల్లోంచి బయటకి పరుగులు తీశారు.

 

 

 

 

ట్రెండింగ్ వార్తలు