Ebola New Strain: 134 మంది మృతి.. ప్రపంచాన్ని వణికిస్తున్న ఎబోలా వైరస్ కొత్త రకం.. లక్షణాలు ఇవే..
ఉగాండాలో ఈ రకం వైరస్ ను 2007లో తొలిసారిగా, 2012లో రెండోసారి గుర్తించారు. ఈ వైరస్ సోకితే 30 నుంచి 40శాతం మంది మరణించినట్లుగా నివేదికలు చెబుతున్నాయి.
- Naveen
- Updated on- May 20, 2026 / 05:25 PM IST
Ebola New Strain: కాంగోలో అరుదైన ఎబోలా వైరస్ కొత్త రకం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ప్రాణాంతక వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 134కు చేరింది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎబోలా వైరస్ కొత్త స్ట్రెయిన్ బుండిబుగియోను ఇప్పటికే పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. కాంగో తూర్పు ప్రాంతంలో ఈ అరుదైన బుండిబుగియో వేరియంట్ బారిన పడి 513 మంది వైద్యం తీసుకున్నట్లుగా వైద్యులు చెబుతున్నారు.
ఎబోలాలో అత్యంత అరుదైన బుండిబుగియో స్ట్రెయిన్ కారణంగానే ప్రస్తుతం కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ రకం కేసులు ఎక్కువగా కాంగోలో నమోదవుతున్నాయి. ఉగాండాలో ఈ రకం వైరస్ ను 2007లో తొలిసారిగా, 2012లో రెండోసారి గుర్తించారు. ఈ వైరస్ సోకితే 30 నుంచి 40శాతం మంది మరణించినట్లుగా నివేదికలు చెబుతున్నాయి.
ఎబోలాలో జైర్ రకం అంటే బుండిబుగియో చాలా ఎక్కువ ప్రమాదకరంగా ఉంది. అన్ని ఎబోలా వైరస్ రకాలు తాకడం కారణంగానే వ్యాపిస్తున్నాయి. జ్వరం, జలుబు, దగ్గు, కండరాల నొప్పి, తల నొప్పి లాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వాంతులు, విరేచనాలతో శరీరంలోని అవయవాలు దెబ్బతింటాయి. దీన్నే మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అని కూడా అంటున్నారు.
ఎబోలా వైరస్ లక్షణాలు ఉన్న వారు వెంటనే తగిన చికిత్సలు తీసుకోవాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెబుతోంది. శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గితే ఈ వైరస్ వ్యాప్తి పెరుగుతుంది. దీంతో ఇమ్యూనిటీ పెంచే ఆహార పదార్ధాలు ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇక ఈ ప్రాణాంతక వైరస్ బారిన పడ్డ ఒక అమెరికా పౌరుడిని అత్యవసర చికిత్స నిమిత్తం జర్మనీకి తరలించినట్లుగా అమెరికా వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం ప్రకటించింది.
Also Read: గూగుల్ ఫ్యూచర్ ప్లాన్ రెడీ.. సుందర్ పిచాయ్ 5 అతిపెద్ద AI ప్రకటనలు ఇవే!
