El Salvador Cryptocurrency : చిన్నదేశం..గొప్ప ఆలోచన..అగ్నిపర్వతాల నుంచి బిట్‌కాయిన్‌ తయారీ ఘనత

‘అగ్ని పర్వతాల ఎనర్జీ జియో థెర్మల్‌తో బిట్‌కాయిన్‌ తయారు చేసిన ఘనత దక్కించుకుంది ఎల్‌ సాల్వడర్‌ దేశం.క్రిప్టోకరెన్సీ మార్కెటింగ్‌లో బిట్ కాయిన్ ద్వారా డాలర్ల పంట పండిస్తోంది.

El Salvador First Bitcoin With Volcanic Energy: దేశం చిన్నదైనా పెద్దదైనా దేశాబివృద్ధి ఆ దేశ పాలకుల ఆలోనా విధానలపైనే ఆధారపడి ఉంటుందని నిరూపించింది అతి చిన్నదేశమైన మధ్య అమెరికా దేశమైన ఎల్ సాల్వడర్. ఎవ్వరూ ఊహిచని ఆలోచనతో ప్రపంచ దేశాల దృష్టిని తనవైపుకు తిప్పుకుంది. ఒకప్పుడు ఎవరికి పండిన పంటను మార్పిడి చేసుకుని జీవించేవారు. తరువాత కరెన్సీ వచ్చింది. లోహంతో తయారైంది. తరువాత కాగితాల రూపంలోకి వచ్చింది. కానీ కాలం మారుతోంది. అలాగే కరెన్సీ రూపంకూడా మార్చుకుంటోంది. కాగితాల రూపంలో ఉండే కరెన్సీ కాస్తా ఇప్పుడు ‘క్రిప్టోకరెన్సీ’ (Cryptocurrency).ఈ క్రిప్టోకరెన్సీ ‘బిట్ కాయిన్’ తో పాటు Ethereum,Cardano,Binance Coin,Tether,Solana,Dogecoin ఇలా పలు పేర్లతో డిజిటల్ కరెన్సీగా మార్పు చెందింది.

Read more : Smart Watch Saves Man Life : గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చిన స్మార్ట్‌వాచ్‌..చావుబతుకుల్లో ఉన్న అతని ప్రాణం కాపాడింది

అటువంటి క్రిప్టోకరెన్సీలో ఒకటైన బిట్ కాయిన్ విషయంలో చిన్నదేశమైన ఎల్‌ సాల్వడర్‌ గొప్పగా ఆలోచించింది. ఓకీలక అడుగు వేసి ప్రపంచాల దృష్టిని ఆకర్షించింది. ప్రకృతిలో భాగమైన ‘అగ్నిపర్వతాల నుంచి బిట్ కాయిన్ తయారు చేయటం ద్వారా పెను సంచలనానికి నాంది పలికిందీ బుల్లిదేశం. ఈ దేశంలో ఆలోచన గురించి తెలిసిన పెద్ద పెద్ద దేశాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి. అగ్నిపర్వతాల నుంచి ఉత్పత్తి అయ్యే పవర్ అయ్యే పవర్‌ను వినియోగించుకుని బిట్‌కాయిన్‌ తయారు చేయడం ద్వారా సంచలనానికి తెరలేపింది 3 లక్షల లోపు జనాభా కలిగిన చిన్నదేశం ఎల్‌ సాల్వడర్‌.ఎ. వోల్కనో ఎనర్జీ ద్వారా ఇప్పటికే 0.00599179 బిట్‌కాయిన్‌(269 డాలర్ల)ను ఉత్పత్తి చేసింది కూడా. ఈ విషయాన్ని ఎల్‌ సాల్వడర్‌ దేశాధ్యక్షుడు నయిబ్‌ బుకెలె అధికారికంగా ట్విటర్‌ ద్వారా ప్రకటించారు.

కాగా..
క్రిప్టోకరెన్సీ మార్కెటింగ్‌లో ప్రస్తుతం పోటీతత్వం కొనసాగుతోందనే విషయం తెలిసిందే. ఈ సమయంలో అగ్ని పర్వతాల ఎనర్జీ జియో థెర్మల్‌తో బిట్‌కాయిన్‌ తయారు చేసిన ఘనత దక్కించుకుంది. తద్వారా పునరుత్పాదక శక్తి(మళ్లీ మళ్లీ ఉపయోగించుకోవచ్చు) ద్వారా అభివృద్ధికి అత్యంత కీలకమైన అడుగు వేసి కొత్త ఆలోచనకు తెరలేపి ప్రపంచంలో అభివృద్ధిలో దూసుకుపోతున్న దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది.

Read more : Xiaomi NFC Pay: వాచ్ బెల్ట్‌తోనే మనీ ట్రాన్సాక్షన్లు.. షియోమీ నుంచి అద్భుతమైన ఫీచర్

జియోథర్మల్‌ ఎనర్జీ అనేది స్వచ్ఛమైంది. అగ్నిపర్వతాల వేడిమి(అంతర్గతంగా) ఉపయోగించుకుని ఈ జియోథర్మల్‌ ఎనర్జీని తయారు చేస్తారు. ఇది ఇంతకు ముందు ఏ వనరునైతే ఉపయోగించుకుంటుందో.. తిరిగి దానినే వాడుకుంటుంది. తద్వారా విడుదలయ్యే వేడి పోను పోనూ తగ్గుతుంది. పైగా థర్మల్‌ ఎనర్జీని డిజిటల్‌ ఎనర్జీగా అంటే బిట్‌కాయిన్‌ గా మార్చడం వల్ల ఎక్కడికైనా ఎగుమతి చేయొచ్చు. శక్తి కోల్పోకుండా దానిని స్టోర్‌ చేయొచ్చు. దీనికి సంబంధించి జియోథర్మల్‌లో బిట్‌కాయిన్ల ఉత్పత్తికి సంబంధించిన వీడియోను కూడా సాల్వడర్‌ దేశాధ్యక్షుడు ఎల్ నయిబ్‌ బుకెలె శుక్రవారం (అక్టోబర్ 1,2021) ట్విటర్‌ లో పోస్ట్ చేశారు.

బిట్‌కాయిన్‌ల ఉత్పత్తి వాతావరణంలోకి అధిక వేడిమికి ఉత్పత్తి చేస్తుంది. ఈ వేడిమి చాలా ప్రమాదకారకం. పైగా కంటికి కనిపించని ఈ కరెన్సీని డిజిటల్‌గా తయారు చేయడం కోసం బోలెడంత కరెంట్‌ని కూడా ఉపయోగించాల్సి ఉంటుంది. అంటే కంప్యూటర్‌ల కోసం అన్నమాట. అయితే ఎల్‌ సాల్వడర్‌ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కరెంట్‌ ఆదాకావటమేకాకుండా జియోథర్మల్‌ వల్ల వేడిమి స్థాయి కూడా వాతావరణంలోకి తక్కువగా విడుదల అవుతుంది. ఈ వినూత్న ఆలోచనే ఆ దేశంపై ప్రశంసలు కురిసేలా చేసింది. ప్రపంచ దేశాల నుంచి హర్షాతికేరాలు వ్యక్తం అయ్యేలా చేసింది. ఎల్‌ సాల్వడర్‌ చేసిన ఈ ప్రయత్నం మరికొన్ని దేశాలకు ప్రోత్సాహం ఇస్తుందని ట్విటర్‌ సీఈవో జాక్‌ డోర్సే పొగడ్తలు గుప్పించారు.

బిట్‌కాయిన్‌ క్రిప్టోకరెన్సీ విషయాన్ని ఈ దేశం ఇప్పటికిప్పుడే తీసుకున్న నిర్ణయం కాదు..ముందుగానే దీని గురించి ఆలోచించిది. చాలాకాలం క్రితమే బిట్‌కాయిన్‌ క్రిప్టోకరెన్సీకి చట్టబద్ధత కల్పించింది. అంతే ఈ చిన్నదేశానికి ఎంత ముందు ఆలోచనో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు బిట్‌కాయిన్‌ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఎల్‌సాల్వాడర్‌ ప్రభుత్వం తమ దేశ పౌరులకు గతంలోనే 30 డాలర్ల విలువ గల బిట్‌కాయిన్లను అందించింది. కానీ ప్రజలకు ఇది నచ్చలేదు. బిట్‌కాయిన్‌కు మద్దతు ఇచ్చే వ్యవస్ధలు లోపాలున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు చేసే ఈ నిరసనల ప్రభావంతో ఈ ఏడాది సెప్టెంబర్‌ మొదటి వారంలో బిట్‌కాయిన్‌ విలువ భారీగా పడిపోయింది. అయినా..ప్రభుత్వం మాత్రం ఏమాత్ర తగ్గేదే లేదంటోంది. అందుకే ఇప్పటికే చివో(కూల్‌) పేరుతో వర్చువల్‌ వ్యాలెట్‌ను కూడా మెయింటెన్‌ చేస్తోంది ఎల్‌ సాల్వడర్‌. చూశారా..దేశం చిన్నదైనా పాలకుల ముందచూపు ఆలోచనతో ఎటువంటి సంచలనాలు చేయవచ్చో ఈ ఎల్ సాల్వడర్ దేశాన్ని చూసి నేర్చుకోవచ్చననిపిస్తోందికదూ..

 

ట్రెండింగ్ వార్తలు