తిక్కలేచి..తొక్కిపడేసిన గజరాజు : 18మందికి గాయాలు 

  • Publish Date - September 19, 2019 / 10:49 AM IST

ఏనుగులకు తిక్కలేచిందంటే ఎవ్వరినీ లెక్కచేయవు. తొక్కి పడేస్తాయంతే. ముఖ్యంగా ఊరేగింపుల్లో ఇటువంటి ఘటనలు జరగుతుంటాయి. పెద్ద పెద్ద శబ్దాలు వినిపించినా ఏనుగులు ఇరిటేట్ అవుతాయి. అప్పుడు అవి చేసే విధ్వంసం అంతా ఇంతాకాదు. ఇటువంటి ఘటన శ్రీలంక బుద్దిస్ట్ వేడుకల్లో భాగంగా శ్రీలంక రాజధాని కొలంబో సమీపంలోని కొటే పట్టణంలో జరుగుతున్న  ఏనుగుల అందాల పోటీల్లో చోటుచేసుకుంది. 

ఏనుగుల అందాల పోటీలను శ్రీలంకలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. బౌద్ధ మతస్తులు నిర్వహించే ఈ కార్యక్రమానికి  దేశవ్యాప్తంగా ఎంతోమంది వస్తారు. ప్రతీ సంవత్సరం లాగనే ఈ ఏడాది కూడా ఏనుగుల అందాల పోటీల్లో ఓ గజరాజు బీభత్సం సృష్టించింది. అక్కడ ఉన్న జనాలపై విరుచుకుపడింది. దాని కోపం కట్టలు తెంచుకోవటం కంటికి కనిపించిన వారందరినీ ఇష్టం వచ్చినట్లుగా తొక్కేపడేసింది. ఏనుగు ఉగ్రరూపం చూసి జనాలు పరుగు లంకించుకున్నారు.

బతుకు జీవుడా అంటూ ఉరుకులు పెట్టారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలికి బుద్ధి చెప్పారు. అయినా కూడా కొందరు ఏనుగు బీభత్సానికి తీవ్రంగా గాయాలపాలయ్యారు.ఏనుగు దాడిలో 18 మంది గాయపడ్డారు. ఏనుగు సృష్టించిన బీభత్సనికి మావడి ఉడతపిల్లలా కింద పడ్డాడు.అతనికి కూడా గాయాలయ్యాయి. అదృష్టం కొద్దీ బైటపడ్డాడు కానీ ఏనుగు కాలు కనుక పడుంటే పచ్చడైపోయేవాడు.కొద్దిపాటి గాయాలతో బైటపడ్డాడు.