Canada MP Chandra Arya : కెనడా పార్లమెంటులో కన్నడ భాష.. ఆ ఎంపీపై ప్రశంసల వర్షం, వీడియో వైరల్

దేశం కాని దేశంలో ఉంటున్నా.. మాతృభాషను మరువలేదు. మాతృభాషపై తనకున్న అభిమానాన్ని ఏకంగా పార్లమెంటులో చాటి చెప్పి అందరి మనసులు గెలుచుకున్నారు.(Canada MP Chandra Arya)

Canada MP Chandra Arya : పుట్టిన ఊరిని, రాష్ట్రాన్ని, దేశాన్ని వదిలి వెళ్లినా.. వాటిపై తన మమకారాన్ని మాత్రం ఆ ఎంపీ వీడలేదు. అంతకుమించి తన మాతృభాషను అస్సలు మరవలేదు. దేశం కాని దేశంలో ఉంటున్నా.. మాతృభాషను నిర్లక్ష్యం చేయలేదు. మాతృభాషపై తనకున్న అభిమానాన్ని ఏకంగా పార్లమెంటులో చాటి చెప్పి అందరి మనసులు గెలుచుకున్నారు. అంతా ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. కెనడా పార్లమెంటులో కన్నడ భాష వినిపించింది. ఆశ్చర్యంగా ఉంది కదూ. ఇది నిజమే. కెన‌డా ఎంపీ చంద్ర ఆర్య కెన‌డా పార్ల‌మెంట్‌లో క‌న్న‌డ భాష‌లో మాట్లాడారు. భారత సంతతి వ్యక్తి చంద్ర ఆర్య కెనడాలో ఎంపీగా ఎన్నికయ్యారు. కెనడా పార్లమెంటులో మాట్లాడే సందర్భంగా వచ్చింది. ఈ క్రమంలో ఆయన పార్లమెంటు సభ్యులను ఆశ్చర్యపరుస్తూ తన మాతృభాష కన్నడలో మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకోవడంతో అది కాస్తా వైరల్ గా మారింది.(Canada MP Chandra Arya)

Sun Rare Images : సూర్యుడి అరుదైన చిత్రాలు..తొలిసారిగా కెమెరాకు చిక్కాయి

ఓ విదేశీ పార్లమెంటులో కన్నడ మాట్లాడటం ఇదే తొలిసారి అని ఆయన అన్నారు. ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా, ఎప్పటికీ కన్నడ వాడినే అంటూ ఆయన ఓ కవిత చదివి వినిపించారు.

కెనడా పార్ల‌మెంట్ వేదిక‌గా చంద్ర ఆర్య క‌న్న‌డ‌లో అన‌ర్గ‌ళంగా మాట్లాడేశారు. అంతే.. సోష‌ల్ మీడియా ఆయ‌నను హైలైట్‌ చేసింది. మాతృభాష‌ను అంద‌ళ‌మెక్కించినందుకు నెటిజ‌న్లు ప్ర‌శంస‌ల వర్షం కురిపిస్తున్నారు.

Chandra Arya

తన మాతృభాష క‌న్న‌డ‌లో మాట్లాడ‌డానికి ఆ ఎంపీ కెన‌డా పార్ల‌మెంట్ స్పీక‌ర్ అనుమ‌తి తీసుకున్నారు. ఇలా క‌న్న‌డ భాష‌లో మాట్లాడినందుకు త‌న‌కు ఎంతో గ‌ర్వంగా ఉంద‌ని చంద్ర ఆర్య చెప్పుకొచ్చారు. ఈ భాష‌ను 5 కోట్ల మంది మాట్లాడ‌తార‌ని చెప్పారు. ఇక ఉప‌న్యాసం ముగింపులో క‌న్న‌డ ర‌చ‌యిత కువెంపు రాసిన కవితతో చంద్ర ఆర్య త‌న ఉప‌న్యాసాన్ని ముగించారు. ఎక్క‌డ ఉన్నా… ఎలా ఉన్నా.. మీరు క‌న్న‌డిగులుగా ఉండండి అన్న‌ది ఆ కవిత సారాంశం. అలాగే యాక్టర్, సింగర్ డాక్టర్ రాజ్ కుమార్ ను కూడా ఆయన గుర్తు చేసుకున్నారు.(Canada MP Chandra Arya)

Chandra Arya (1)

”ఎల్లదరు ఇరువురు అంతారూ ఇరు అందెందీగు నీ కన్నడవాగిరు (మీరు ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా, ఎప్పటికీ కన్నడిగులుగా ఉండండి) అని ట్వీట్ చేశారు చంద్ర ఆర్య. “కెనడా పార్లమెంటులో నేను నా మాతృభాష కన్నడలో మాట్లాడాను. ఈ అందమైన భాషకు సుదీర్ఘ చరిత్ర ఉంది. సుమారు 5కోట్ల మంది ప్రజలు మాట్లాడతారు. భారతదేశం వెలుపల ప్రపంచంలోని ఏ పార్లమెంటులోనైనా కన్నడ మాట్లాడటం ఇదే తొలిసారి’’ అని చంద్ర ఆర్య ట్వీట్ లో తెలిపారు. తన కన్నడ ప్రసంగంలో, తాను కర్ణాటకలోని తుమకూరు జిల్లా సిరా తాలూకాకు చెందినవాడినని చంద్ర ఆర్య తెలిపారు.

Elon Musk: ఎలన్ మస్క్‌పై ఆరోపణలు కప్పిపుచ్చుకునేందుకు రూ.194కోట్లు నిజమేనా..

కాగా, కెనడా పార్లమెంటులో మాతృభాషలో మాట్లాడిన ఎంపీ చంద్ర ఆర్యపై ప్రశంసల వర్షం కురుస్తోంది. కర్నాటక ఉన్నత విద్యాశాఖ మంత్రి అశ్వత్ నారాయణ చంద్ర ఆర్య వీడియోను షేర్‌ చేశారు. కెనడా పార్లమెంట్‌లో కన్నడలో మాట్లాడినందుకు చంద్ర ఆర్యకు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణదీప్‌ సింగ్‌ సూర్జేవాలా సైతం వీడియోను షేర్ చేశారు. భారతదేశం, కర్నాటక రాష్ట్రం గర్వించేలా చేసినందుకు చంద్ర ఆర్యకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. “కర్ణాటకలోని తుమకూరు కుమారుడికి సెల్యూట్‌’ అంటూ సుర్జేవాలా ట్వీట్‌ చేశారు.

Chandra Arya (2)

చంద్ర ఆర్య మెదటిసారిగా 2015లో కెనడా పార్లమెంటుకు ఎన్నికయ్యారు. 2019లో రెండవసారి నేపియన్‌కు ప్రాతినిధ్యం వహించారు. చంద్ర ఆర్య కర్ణాటకలో పుట్టి పెరిగారు. బెంగళూరు యూనివర్శిటీ నుంచి ఇంజినీరింగ్‌ కోర్సు చేశారు. కర్ణాటక యూనివర్సిటీలో ఎంబీఏ చేస్తున్నప్పుడు, ఖతార్‌కు వెళ్లే ముందు ఢిల్లీలో DRDO, కర్ణాటక స్టేట్‌ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌లో పనిచేశారు. ఆర్య భార్య సంగీత ఒట్టావా కెనడాలోని కాథలిక్‌ స్కూల్‌ బోర్డులో పనిచేస్తోంది. దాంతో ఆయన ఖతార్‌ నుంచి కెనడా వెళ్లారు. అక్కడే నివసిస్తున్నారు. అక్కడే తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు.

ట్రెండింగ్ వార్తలు