Mount Everest
Mount Everest : ఎల్లీ గిబ్సన్, హెలెన్ థోర్న్ ‘ది స్కమ్మీ మమ్మీస్’ పేరుతో వరల్డ్ వైడ్ ఎన్నో స్టాండ్-అప్ కామెడీ ప్రదర్శనలు ఇచ్చారు. అయితే ఈసారి వారు అరుదైన ప్రదేశంలో ప్రదర్శన నిర్వహించారు. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌లో స్టాండ్-అప్ కామెడీ ప్రదర్శన ఇచ్చి ప్రపంచ రికార్డు క్రియేట్ చేశారు.
Real Hero : ఎవరెస్ట్ డెత్ జోన్ నుంచి క్లైంబర్‌ను కాపాడిన నేపాలీకి సెల్యూట్ చేస్తున్న నెటిజన్లు
‘ది స్కమ్మీ మమ్మీస్’ పేరుతో ఎంతో ఫేమస్ అయిన ఎల్లీ గిబ్న్, హెలెన్ థోర్న్ గురించి చాలామందికి తెలుసు. సార్ట్ యువర్ షట్ అవుట్ అనే అవార్డు-గెలుచుకున్న ఈ జంట తాజాగా మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌లో స్టాండ్-అప్ కామెడీ ప్రదర్శన ఇచ్చి అందర్నీ అలరించారు. గిన్నిస్ వరల్డ్ రికార్డు బద్దలు కొట్టారు. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ దగ్గర అంటే 5,364 మీటర్ల ఎత్తు (17,598 అడుగులు) ఎత్తులో వీరు ప్రదర్శన నిర్వహించారు.
ఎల్లీ గిబ్న్, హెలెన్ థోర్న్ ఈ ప్రదర్శన ఇవ్వడం వెనుక బలమైన కారణం ఉంది. నెలలు నిండకుండానే పుట్టే శిశువులకు మద్దతుగా ఈ కార్యక్రమం నిర్వహించారట. గిబ్సన్ కుమారుడు జో డిసెంబర్ 2014 లో తొమ్మిది వారాల ముందుగా జన్మించాడట. అలాంటి వారి విషయంలో అవగాహన కల్పించడం కోసం.. నిధులను సేకరించే ప్రయత్నంలో ఈ ప్రదర్శన ఇచ్చారట. అయితే వీరు బేస్ క్యాంప్‌కు చేరుకోవడానికి చాలా కష్టాలు పడాల్సి వచ్చిందట. గ్లోబల్ వార్మింగ్ కారణంగా బేస్ క్యాంప్ చుట్టూ ఉన్న మంచు కరిగిపోయిందని వారు గుర్తించారు. ఇది శిబిరం ఎత్తును తగ్గించింది. దాంతో వారు 5,364 మీటర్లు (17,598 అడుగులు) ఎత్తుకు చేరుకోవడానికి మరింత పైకి ఎక్కవలసి వచ్చిందట.
Huge Mountains : భూమి లోపల భారీ పర్వతాలు.. భూమిపై ఉన్న మౌంట్ ఎవరెస్ట్ కన్నా నాలుగు రెట్లు ఎత్తైనవి
మొత్తానికి బేస్ క్యాంప్‌ను చేరుకున్న ఇద్దరు అక్కడి పర్మిషన్ తీసుకున్న తర్వాత క్యాట్ సూట్ లలోకి మారారు. ఎవరెస్ట్ అధిరోహకుల ఎదురుగా ప్రదర్శన ఇచ్చారు. అలా ప్రపంచ రికార్డ్ సాధించారు.