Huge Mountains : భూమి లోపల భారీ పర్వతాలు.. భూమిపై ఉన్న మౌంట్ ఎవరెస్ట్ కన్నా నాలుగు రెట్లు ఎత్తైనవి
భూమిపై మౌంట్ ఎవరెస్ట్ 8.8 కిలో మీటర్ల ఎత్తులో ఉండగా భూమి లోపల ఉన్న ఈ పర్వతాలు ఏకంగా 38 కిలో మీటర్ల ఎత్తు వరకు ఉన్నాయని పేర్కొన్నారు.

huge mountains
Huge Mountains Inside Earth : సాధారణంగా భూమిపై పర్వతాలు, కొండలు, గుట్టలు ఉంటాయి. అయితే భూమిపైనే కాదు భూ అంతర్భాగంలో కూడా భారీ పర్వతాలు ఉన్నట్లు గుర్తించారు. అమెరికాలోని అరిజోనా స్టేట్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు భూమి లోపల భారీ పర్వతాలు ఉన్నట్లు కనుగొన్నారు.
భూమిపైనే ఎత్తైన పర్వతంగా ఉన్న మౌంట్ ఎవరెస్ట్ కన్నా భూమి లోపల ఉన్న పర్వతాలు మూడు, నాలుగు రెట్లు ఎత్తైనవని చెబుతున్నారు. భూమిపై మౌంట్ ఎవరెస్ట్ 8.8 కిలో మీటర్ల ఎత్తులో ఉండగా భూమి లోపల ఉన్న ఈ పర్వతాలు ఏకంగా 38 కిలో మీటర్ల ఎత్తు వరకు ఉన్నాయని పేర్కొన్నారు.
భూమి లోపల 2,900 కిలో మీటర్ల లోతులో ఈ పర్వతాలు ఉన్నట్లు తెలిపారు. వీటిని అల్ట్రా-లో వెలాసిటీ జోన్స్(యూఎల్వీజెడ్)గా పిలుస్తున్నారు. అంటార్కిటికాలోని భూకంప అధ్యయన కేంద్రాల నుంచి వెలువడిన సమాచారం ఆధారంగా ఈ పర్వతాలను గుర్తించినట్లు పరిశోధకులు వెల్లడించారు.