Elon Musk: వరసకు కూతురయ్యే మహిళతో ఎలన్ మస్క్ తండ్రికి ఇద్దరు పిల్లలు

ఎలన్ మస్క్ తండ్రి 76ఏళ్ల ఎర్రల్ మస్క్‌కు ఐదేళ్ల కొడుకున్నాడని మీకు తెలుసా. ఈ సీక్రెట్ బిడ్డ గురించి ఇటీవలే బయటపెట్టాడు పెద్ద మస్క్. అది కూడా తన రెండో భార్య కూతురైన జానా బెజూడెన్‌హోట్‌తో కలిగిన సంతానమట. ద సన్ అనే ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరో కీలక ఉద్దేశ్యాన్ని కూడా బయటపెట్టాడు.

Errol Musk

Elon Musk: ఎలన్ మస్క్ తండ్రి 76ఏళ్ల ఎర్రల్ మస్క్‌కు ఐదేళ్ల కొడుకున్నాడని మీకు తెలుసా. ఈ సీక్రెట్ బిడ్డ గురించి ఇటీవలే బయటపెట్టాడు పెద్ద మస్క్. అది కూడా తన రెండో భార్య కూతురైన జానా బెజూడెన్‌హోట్‌తో కలిగిన సంతానమట. ద సన్ అనే ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరో కీలక ఉద్దేశ్యాన్ని కూడా బయటపెట్టాడు.

“మనం ఈ భూమ్మీదకు వచ్చిందే రీప్రొడక్షన్ చేయడం కోసమే” అని చెప్తున్నాడు ఎర్రల్ మస్క్.

దక్షిణాఫ్రికాలో ఇంజినీర్ గా పనిచేసే ఈయన బెజూడెన్‌హోట్‌తో కలిసి ఉంటుండగా 2019లో ఇంకోసారి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిందట. అంతకంటే ముందే వీరిద్దరికి పుట్టిన ఎలియట్ రష్ కు ఐదేళ్ల వయస్సు. అంతా కలిసి ఎరల్ మస్క్ కు ప్రస్తుతం ఏడుగురు పిల్లలు. వారిలో టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ ఒకరు.

Read Also : దటీజ్ మస్క్..9 మంది బిడ్డలకు తండ్రి అయిన ఎలన్ మస్క్..!!

ఎరల్ మస్క్ రెండో భార్య సంతానమే ఈ జానా బెజూడెన్‌హోట్‌. 1979లో మాయె హల్దెమన్ మస్క్‌తో విడిపోయాక హీడె బెజూడెన్‌హోట్‌తో వివాహం జరిగింది. ఈమె కూతురే ఎర్రల్ మస్క్ ప్రస్తుత భార్య. మస్క్ మొదటి భార్య సంతానంలో ఎలన్ తో పాటు కింబాల్, టోస్కా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.