Elon Musk : దటీజ్ మస్క్..9 మంది బిడ్డలకు తండ్రి అయిన ఎలన్ మస్క్..!!

ఎలన్‌కు సంబంధించి.. కచ్చితంగా చెప్పుకోవాల్సిన.. తెలుసుకోవాల్సిన క్రేజీ న్యూస్ ఒకటి బయటకొచ్చింది. అదేమిటంటే.. మస్క్ ఇప్పుడు 9 మంది బిడ్డలకు తండ్రి అయ్యాడు. దీనిని కూడా.. అతను చాలా క్రేజీగా ప్రకటించాడు.

Elon Musk : దటీజ్ మస్క్..9 మంది బిడ్డలకు తండ్రి అయిన ఎలన్ మస్క్..!!

Elon Musk Now Father Of 9

Elon Musk : లైఫ్‌లో కొందరిని చూసినప్పుడు.. వారి లైఫ్‌ స్టైల్‌ని గమనించినప్పుడు.. అధ్యక్షా.. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా? అని చాలా సార్లు అనుకొని ఉంటాం. కానీ.. ఎలన్ మస్క్ లైఫ్ మినిమం కాదు.. మనం ఊహించలేనంత మ్యాగ్జిమమ్ ఉంటుంది. తనకు నచ్చినట్టు ఉంటాడు. నచ్చింది చేస్తాడు. మెచ్చినదాన్ని.. ఎంత ఇచ్చైనా.. సొంతం చేసుకుంటాడు. ఒక్క మాటలో చెప్పాలంటే.. అతనో క్రేజీ మ్యాన్. ఎంత క్రేజీ అంటే.. ఈ విషయం అతన్ని అడిగినా కూడా సరైన సమాధానం రాదు.

మస్క్ సీరియస్ ఇష్యూని.. సిల్లీగా మార్చేయగలడు..సింపుల్ మ్యాటర్‌ని.. ఎంత పెద్ద సీన్ అయినా చేయగలడు..జస్ట్ ఒక్క ట్వీట్‌తో.. మొత్తం తలకిందులు చేసేస్తాడు.. తనకు నచ్చితే.. తాను మెచ్చితే.. ఎంత ఖర్చు అయినా వెనుకాడకుండా కొనేస్తాడు.. దటీజ్ ఎలన్ మస్క్. అతని చర్యలు ఊహాతీతం. మస్క్ ప్రపంచ కుబేరుడు మాత్రమే కాదు.. ఈ ప్రపంచంలోనే మోస్ట్ పవర్‌ఫుల్‌ మ్యాన్. అతను తలచుకుంటే.. అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయగలడు. ఎవ్వరికీ భయపడడు. ప్రత్యర్థులైనా.. వారిని మించిన దేశాధినేతలైనా. నచ్చినట్లు మాట్లాడతాడు. నచ్చినట్లు జీవిస్తాడు. ఒక్క ట్వీట్‌తో.. ప్రపంచ పరిస్థితులను తారుమారు చేయగల సత్తా అతని సొంతం. అందుకే.. ఎలన్ మస్క్ ఏం చేసినా హాట్ టాపిక్‌గా మారిపోతుంది. క్షణాల్లో.. వరల్డ్ వైడ్ వైరల్‌ అయిపోతుంది.

మస్క్ ఎంత క్రేజీ పర్సనో.. అతనికి కూడా తెలియదు. డ్యాన్స్‌లు వేస్తాడు.. అదే పనిగా పనిచేసుకుంటూ వెళ్లిపోతాడు. ఒక్కోసారి.. ఆఫీసులోనే నిద్రపోతాడు. రోజులో 18 గంటల పాటు పనిచేసిన రోజులు కూడా ఉన్నాయ్. ఒక్క మాటలో చెప్పాలంటే.. అతనో పని పిచ్చోడు. ఎప్పుడెలా ప్రవర్తిస్తాడో.. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో.. ఎవ్వరూ ఊహించలేరు. మస్క్ నెక్ట్స్ మూవ్ ఎలా ఉండబోతుందో.. బ్రహ్మదేవుడు కూడా అంచనా వేయలేడు. ఇలా చెప్పుకుంటూ పోతే.. మనకున్న టైం సరిపోదు. అయినా సరే.. ఎలన్‌కు సంబంధించి.. కచ్చితంగా చెప్పుకోవాల్సిన.. తెలుసుకోవాల్సిన క్రేజీ న్యూస్ ఒకటి బయటకొచ్చింది. అదేమిటంటే.. మస్క్ ఇప్పుడు 9 మంది బిడ్డలకు తండ్రి అయ్యాడు. దీనిని కూడా.. అతను చాలా క్రేజీగా ప్రకటించాడు. అదే.. అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

మస్క్‌కు టెస్లా, స్పేస్‌ ఎక్స్, న్యారాలింక్ లాంటి అనేక సంస్థలున్నాయ్. అయితే.. న్యూరాలింక్‌ కంపెనీలో.. ఉన్నతస్థాయి ఉద్యోగిని షివోన్ జిలిస్‌తో కలిసి.. గతేడాది ఇద్దరు కవలలకు మస్క్ తండ్రయ్యాడు. వీరితో కలిపి ఎలన్ 9 మంది బిడ్డలకు తండ్రిగా అవతరించాడు. ఈ విషయంలో.. తనపై తానే జోక్ వేసుకున్నాడు. ప్రపంచం తక్కువ జనాభాతో బాధపడుతోందని.. ఇందుకోసం తన వంతు కృషి చేస్తున్నానని.. సెల్ఫ్ సెటైర్ వేసుకున్నాడు. భవిష్యత్తులో ప్రపంచ జననాల రేటు దారుణంగా పడిపోయే అవకాశముందని.. అందుకే జనాభానను పెంచుతున్నానని.. తన వెటకారాన్నంతా ట్వీట్‌లో పెట్టి వదిలాడు.

2021లో మస్క్, జిల్స్ కవలలకు జన్మనిచ్చారంటూ.. ఇంటర్నేషనల్ మీడియాలో వార్తలొచ్చాయ్. తమ కవల పిల్లల పేర్లలో.. మధ్యలో తల్లి పేరు, చివరన తండ్రి పేరు వచ్చేలా మార్పులు చేసేందుకు.. వారు కోర్టులో దరఖాస్తు చేసుకోవడంతో.. ఈ విషయం బయటకొచ్చింది. మస్క్‌కు ఇప్పటికే అతని మాజీ భార్య, కెనడా రచయిత జస్టిన్ విల్సన్‌తో.. గ్రిఫిన్, వివియన్, కాయ్, శాక్సన్, డామియన్ అనే ఐదుగురు సంతానం ఉన్నారు. ఇక.. సింగర్ గ్రిమ్స్‌తో ఆయనకు గ్జాయే ఆగ్జి, ఎక్సా డార్క్ సిడరేల్ అనే సంతానం కలిగారు. ఇప్పుడీ కవలలతో.. ఎలన్ మస్క్ సంతానం సంఖ్య 9కి చేరింది. ఇది.. ఇక్కడితో ఆగుతుందా.. ఇంకా పెరుగుతుందా అన్నది.. ప్రస్తుతానికి సస్పెన్స్.

ఇదొక్కటే కాదు.. ఎలన్ మస్క్ ఏ పని చేసినా చాలా డిఫరెంట్‌గా, సస్పెన్స్‌గా, థ్రిల్లింగ్‌గా ఉంటుంది. కానీ.. అతనెలాంటి డెసిషన్ తీసుకున్నా.. చాలా వేగంగా అమలు చేస్తారు. అయితే.. కొన్ని నిర్ణయాలు ఊహించనంత ఎత్తుకు తీసుకెళితే.. మరికొన్ని నేలకేసి కొట్టాయ్. ఓటమి ఎదురైనప్పుడు కుంగిపోలేదు. విజయం వరించిందని పొంగిపోలేదు. అదే.. క్రేజీ యాటిట్యూడ్‌తో.. తన స్టైల్లో ముందుకెళ్తున్నారు ఎలన్ మస్క్. ఇటీవలే.. ట్విట్టర్ కొంటానని హడావుడి చేశారు. 44 బిలియన్ డాలర్లకు డీల్ కూడా కుదిరింది. మన కరెన్సీలో.. 3 లక్షల 30 వేల కోట్లకు పైనే అన్నమాట. కానీ.. ఈ మధ్యే ట్విట్టర్ నుంచి వెళ్లిపోతానంటూ మస్క్ కాస్త హడావుడి చేశాడు. ఫేక్ అకౌంట్స్ తేల్చే విషయంలో.. ట్విట్టర్ యాజమాన్యం, మస్క్ మధ్య నెలకొన్న సస్పెన్స్ ఇంకా వీడలేదు. దీంతో.. ట్విట్టర్ కొనుగోలు విషయంలో.. ఇప్పటికీ సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఈ డీల్ ముందుకెళ్లడంపై అనుమానాలు నెలకొన్నాయని.. మీడియాలో కథనాలు వస్తున్నాయ్.

అయితే.. ట్విట్టర్‌లో ఫేక్ అకౌంట్స్ 5 శాతం వరకే ఉంటాయని యాజమాన్యం చెబుతోంది. కానీ.. అంతకంటే ఎక్కువే ఉండే అవకాశం ఉందని మస్క్ వాదిస్తున్నారు. లెక్క తేల్చే వరకు కొనుగోలు విషయంలో ముందుకెళ్లేది లేదని తేల్చి చెప్పారు. ఈ డీల్‌పై జరుగుతున్న చర్చలను కూడా మస్క్ టీమ్ నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఫేక్ అకౌంట్స్‌ని తేల్చే విషయంలో.. ట్విట్టర్ అనుసరిస్తున్న విధానాలు ఎలన్‌కు నచ్చట్లేదట. మరోవైపు.. సొంతంగానూ తేల్చడం మస్క్ టీమ్‌కు సాధ్యపడటం లేదని సమాచారం. దీంతో.. డీల్ ఫండింగ్ విషయంలో.. తదుపరి చర్చల్ని నిలిపివేసినట్లు తెలుస్తోంది.

మరోవైపు.. ట్విట్టర్ మాత్రం.. ఫేక్ అకౌంట్స్ విషయంలో.. మొదటి నుంచీ ఒకే వాదన వినిపిస్తోంది. మస్క్‌కు ఎలాంటి సమాచారం అందజేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతోంది. కానీ.. ఈ పరిణామాలతో.. ఆఫ్టర్ మార్కెట్‌లో ట్విట్టర్ షేరు ధర మరో 4 శాతం పడిపోయింది. ఈ ఏడాది ఇప్పటివరకు 10 శాతం నష్టపోయి 39 డాలర్లకు చేరింది. మస్క్ ఒప్పందంలో.. ఒక్కో షేరును 54 డాలర్లకు కొనుగోలు చేస్తానన్నారు. ఇదంతా పక్కనబెడితే.. ఎలాంటి డీల్ అయినా.. ఎలన్ మస్క్‌తో మామూలుగా ఉండదు. కాసేపు కొంటానంటాడు.. అంతలోనే వద్దంటాడు. మళ్లీ.. కొంటానని అదే ట్విట్టర్‌లో.. ఓ ట్వీట్ చేస్తాడు. ఇలా.. అతని మూడ్ స్వింగ్స్ రకరకాలుగా ఉంటాయ్. ఇందుకు.. ట్విట్టర్ డీలే బిగ్ ఎగ్జాంపుల్.