Mount Erebus
Mount Erebus Volcano: ప్రపంచంలోని అత్యంత విలువైన లోహాలలో బంగారం ఒకటి. ఈ బంగారాన్ని గనుల నుంచి సేకరిస్తారు. సేకరించిన బంగారంతో విలువైన నగలను తయారు చేస్తారు. అయితే, అంటార్కిటికాలోని అత్యంత ఎత్తైన అగ్ని పర్వతం మౌంట్ ఎరెబస్ మాత్రం ప్రతీరోజూ రూ. 5లక్షల విలువైన బంగారాన్ని భూమి నుంచి బయటకు వెదజల్లుతుంది. అంటార్కిటికాలో మంచుతో నిండిన ప్రకృతి దృశ్యం నుంచి 12,448 అడుగుల ఎత్తులో ఈ పర్వతం ఉంది.
ఈ అగ్ని పర్వతం ప్రతిరోజూ 80 గ్రాముల బంగారాన్ని బయటకు చిమ్ముతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. దీనినుంచి వెలువడిన బంగారు రేణువులు గాలిలో ప్రయాణిస్తూ సుమారు 600 కిలో మీటర్ల దూరం వరకు వెళ్లినట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కొన్ని వాయువులు, లావాతో కలిపి బంగారాన్ని వెదజల్లుతున్నట్లు వెల్లడించారు. 1972 నుంచి ఇప్పటి వరకూ ఈ అగ్నిపర్వతం నుంచి సుమారు 1518 కిలోల బంగారు రేణువులు ధూళి రూపంలో వాతావరణంలోకి చేరినట్లు శాస్త్రవేత్తలు అంచనా. అగ్నిపర్వతం కింద బంగారు గని ఉండొచ్చని భావిస్తున్నారు.
ఎరెబస్ మరియు డిసెప్షన్ ఐలాండ్ గురించి తెలుసుకోవడం చాలా కష్టమైన పని. అక్కడికి చేరుకోగానే పరికరాలన్నీ పనిచేయడం మానేస్తాయి. అప్పుడప్పుడు అక్కడ భూకంపాలుకూడా సంభవిస్తుంటాయి. కొన్ని నెలల క్రితం, శాస్త్రవేత్తలు ఇక్కడ మంచు కింద ఉప్పు నీటి నదిని కనుగొన్నారు. ఇది సుమారు ఒక కిలోమీటరు వెడల్పు ఉంటుంది. సుమారు 7000 నుండి 5000 సంవత్సరాల క్రితం ఇక్కడ సముద్రం ఉన్నప్పుడు, దాని నీరు త్వరగా అవక్షేపాలలో కలిసిపోయింది. తరువాత అది మంచుతో కలిసిపోయిందంట. 1979లో న్యూజిలాండ్ కు చెందిన విమానం అంటార్కిటిగా మీదుగా ప్రయాణం చేసింది. ఆ సమయంలో విమానం ఈ అగ్నిపర్వతాన్ని ఢీ కొట్టి కూలిపోయింది. ఆ విమానంలో ఉన్న అందరూ మరణించారు.