15 మంది భార్యలతో స్వర్గసుఖాలు..వారికోసం 120 BMW Cars ఆర్డర్

  • Publish Date - June 25, 2020 / 04:41 AM IST

ప్రపంచ దేశాలు కరోనా వైరస్ తో అల్లాడిపోతున్నాయి. చైనా నుంచి వచ్చిన ఈ దిక్కుమాలిన వైరస్ గడగడలాడిస్తోంది. ఆర్థికంగా కుదేలై పోతున్నాయి. కానీ ఓ రాజు మాత్రం డోంట్ కేర్ అంటున్నాడు. జల్సాల్లో మునిగిపోతున్నారు.

15 మంది భార్యలతో స్వర్గసుఖాలు అనుభవిస్తున్నారు. భార్యలకు కొత కొత్త గిఫ్టులు ఇస్తూ..డబ్బులను నీళ్లలా ఖర్చు చేస్తుండడంతో అందరూ నోరెళ్లపెడుతున్నారు. ప్రజల గురించి మాత్రం పట్టించుకోను అంటున్నాడు ఈ రాజు. ఎవరా రాజు ? ఎంటా కథ అని అనుకుంటున్నారా ? 

ఎస్వత్ని దేశానికి రాజు ‘మస్వతి-111. ఇతనికి ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 15మంది భార్యలు ఉన్నారు. వీరికి 15 మంది పిల్లలున్నారు. చిటికేస్తే..వచ్చే నౌకర్లు..ఎంతో డబ్బు ఇంకేముంది..ఎంజాయ్ చేస్తూ బతికేస్తున్నాడు.

ప్రస్తుతం ఇతని వద్ద రూ. 1.9 కోట్ల విలువ చేసే Rolls Royis Sedan Cars లున్నాయి. ఇవి కాదని..ఏకంగా రూ. 175 కోట్ల విలువ చేసే..120 BMW కార్లు ఆర్డర్ చేశాడంట. నిధులు సగభాగం..ఇతని కుటుంబానికే సరిపోతున్నాయని అనుకుంటున్నారు. గ్యారేజీలో 20 మెర్సిడెస్-మేబాచ్ ఎస్600 పుల్‌మ్యాన్, 62 మేబాచ్, బీఎండబ్ల్యూ X6 కార్లు ఉన్నాయి. ఇవే కాకుండా కొన్ని ప్రైవేట్ జెట్లు కూడా ఉన్నాయి. 

ఇతనిపై ప్రతిపక్షాలు అగ్గిలమీదగుగ్గిలమీద అవుతున్నాయి. ఇదేంది జల్సాలు అని ప్రశ్నిస్తున్నారు. దేశ ప్రజలు ఆకలి చావులతో చనిపోతున్నా..రాజు పట్టించుకోవడం లేదని ఫైర్ అవుతున్నారు. గివేం సోకులురా ? నాయనా ? అంటూ విమర్శలు చేస్తున్నారు.