Eswatini PM dies : కరోనా రాకాసి ఎంతో మందిని బలి తీసుకొంటోంది. సామాన్యుడి నుంచి మొదలుకుని ప్రముఖులు మృతి చెందుతున్నారు. ఇప్పటికే పలు రంగాలకు చెందిన వారిని బలి తీసుకుంది ఈ దిక్కుమాలిన మహమ్మారి. తాజాగా..ఆఫ్రికా దేశమైన ఎస్వాతీనీ ప్రధాని ఆంబ్రోస్ మాడ్వులో లామిని (52) కరోనా సోకి చనిపోయారు. దక్షిణాఫ్రికాలో 2020, డిసెంబర్ 13వ తేదీ ఆదివారం తుదిశ్వాస విడిచినట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. తనకు కరోనా సోకిందని, అయినా..ఎలాంటి లక్షణాలు లేవని గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.
డిసెంబర్ 01వ తేదీన ఓ ఆసుపత్రిలో చేరారు. కానీ..ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తూ వచ్చింది. ఆరోగ్య నిలకడగానే ఉందని, చికిత్సకు బాగా స్పందిస్తున్నారంటూ..ఎస్వాతీని ఉప ప్రధాని థెంబా వెల్లడించారు. కానీ..చికిత్స పొందుతున్న ఆంబ్రోస్..పరిస్థితి మరింత దిగజారడంతో…గత అర్ధరాత్రి కన్నుమూశారు. ఈ విషయాన్నిథెంబా అధికారికంగా ప్రకటించారు. ఎస్వీటీనీ దేశ జనాభ దాదాపు 12 లక్షలు ఉంటుందని అంచనా. ఇప్పటి వరకు 6 వేల 768 కరోనా కేసులు నమోదయ్యాయి.
127 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు సగం మందికిపై గా దారిద్ర రేఖకు దిగువన జీవిస్తున్నట్లు ప్రపంచబ్యాంకు వెల్లడించింది. ఆంబ్రోస్ విషయానికి వస్తే..అక్టోబర్ 2018లో ప్రధానిగా నియమితులయ్యారు. అంతకముందు బ్యాంకింగ్ రంగంలో 18 ఏళ్ల పాటు సేవలందించారు. దేశ ప్రధాని ఆంబ్రోస్ మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.