ఇండియా చేద్దామనుకొంటోంది… వియత్నాం చేసి చూపింది

  • Publish Date - June 9, 2020 / 11:26 AM IST

European Unionతో కుదుర్చుకున్న కీలక ఒప్పందానికి వియత్నాం ఆమోద ముద్రవేసింది. తయారీ రంగానికి ఊతమిచ్చి, ఎగుమతులను పెంచడానికి పనికొచ్చే ఒప్పందమిది. ఈ డీల్‌తో EU ఏకంగా 85శాతం శాతం మేర టారిఫ్‌‌ను తగ్గించుకుంది. ఈ టారిఫ్ తగ్గింపు ఏడేళ్లుంటుంది. బదులుగా వియత్నాం కూడా తన దిగుమతుల మీద 49శాతం పన్నులను తగ్గిస్తుంది. ఈయూకు లాభమేకదా! మిగిలిన టారిఫ్‌ను కూడా వచ్చే 10ఏళ్లలో దశల వారీగా తగ్గిస్తూ వస్తుంది.  

వియత్నాం తెలివైందే? :
దక్షిణాసియాలో సింగపూర్ తర్వాత వియత్నాం EUతో free-trade agreement కుదుర్చుకున్న దేశం. ఈ ఒప్పందంతో వియత్నానికి వాణిజ్యంతో ద్వారాలు తెరచుకున్నాయి. చైనా నుంచి బైటకెళ్లి పోదామనుకొనే సంస్థలు, దేశాలకు వియత్నాం కొత్త స్వర్గధామం. చైనా మీద ఆధారపడటం తగ్గించుకోవాలనేవాళ్లు ఇప్పుడు టారిఫ్ తక్కువగా ఉన్న వియత్నాంకెళ్లి సంస్థలను ఏర్పాటు చేసుకుందామని అనుకుంటారు.

సూదంటురాయిలా భారతదేశం:
చైనా మీద వాణిజ్య యుద్ధం చేయడం కాదు.. అసలు వ్యాపారపరంగా శిక్షించడానికి అమెరికా సిద్ధంకాగానే జపాన్ కూడా చైనాలోని తన సంస్థలు బైటకు రావాలని కోరింది. అంతేనా? ఏకంగా 2.2 బిలియన్ డాలర్ల మేర నిధులను సహాయంగా ప్రకటించింది. ఎప్పుడైతే రెండు వాణిజ్య అగ్రదేశాలు, చైనా మీద చర్యలు తీసుకోగానే ఇండియా అవకాశాల గనిని కనిపెట్టింది. బహుళజాతి కంపెనీల ప్రతినిధులతో కేంద్రం మాట్లాడుతుండగానే కర్నాటక, ఉత్తరప్రదేశ్‌లు తమ వాణిజ్య బృందాలను సిద్ధం చేశాయి.

డేగల్లా అవకాశాలను వెంటాడుతున్నాయి. ఒక కంపెనీ కనుక, చైనానుంచి బైటకు రావాలని అనుకుంటోందని తెలిసిన మరుక్షణంలో, వాళ్ల సెల్‌ఫోన్‌కు పదుల సంఖ్యలో ఇండియా నుంచే కాల్స్ వెళ్తున్నాయి. వాళ్ల సంస్థలను ఇక్కడకు ఏదోలా ఇక్కడకు తరలించేలా ప్రయత్నిస్తున్నాయి. చైనా నుంచి వచ్చేసంస్థల కోసం ఇండియా ఇప్పటికే 4,61,589 హెక్లార్ట భూమిని సిద్ధం చేసింది. విదేశీ సంస్థలకు ఇదో పెద్ద ఆకర్షణ. ఒక్క  ఏప్రిల్‌లోనే భారతేశం 1000 సంస్థలను సంప్రదించింది.

అసలు సవాల్ ఇదే:  
Japanese financial group Nomura నివేదిక ప్రకారం ఎప్రిల్ 2018 నుంచి  అగస్ట్ 2019 మధ్యలో 56  కంపెనీలు చైనా నుంచి బైటకొచ్చేశాయి. అక్కడ ప్రొడెక్షన్ ఆపేశాయి. అందులో 26 Vietnamకి రీలొకేట్ ఐతే, మూడు మాత్రమే ఇండియాకొచ్చాయి. మనకన్నా Taiwan,Thailand బాగా కంపెనీలను ఆకట్టుకున్నాయి. 11,8 చొప్పున ఈ రెండుదేశాలకెళ్లాయి.

ఇండియా నేర్చుకోవాల్సిన పాఠం:
ఇటీవల వియత్నాం గ్లోబల్‌గా మంచి పేరుకొట్టేస్తోంది. అంతెందుకు కరోనావైరస్‌ను అడ్డుకోవడంలో బ్రహ్మాండంగా పనిచేసింది. మోడల్ కంట్రీగా పేరుతెచ్చుకుంది. వియత్నం జనాభా కోటికన్నా తక్కువ. 97 లక్షలు. చైనాతో సుదీర్థ సరిహద్ధుఉన్నా… 327 కేసులు మాత్రమే నమోదైయ్యాయి. ఎవరూ చనిపోలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదో అద్భుతం. 

Read: గతేడాది ఆగస్టులోనే చైనాలో కరోనా వైరస్