United Nations: ఆప్తులే చిదిమేస్తున్నారు.. ప్రతి 11 నిమిషాలకు ఒక మహిళ బలి

ఈ వివక్ష, హింస, దుర్వినియోగం మానవత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. అన్ని రంగాల్లోని మహిళలు దీనికి బాధితులు అవుతున్నారు. మహిళల ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛలను హరిస్తున్నారు. ఇది ప్రపంచానికి అవసరమైన సమాన అవకాశాలను, ఆర్థిక పునరుద్ధరణను అడ్డుకుంటోంది. మహిళలపై జరుగుతోన్న హింసను ఇక చరిత్ర పుస్తకాల్లోకి పంపాలి. ఇందుకు ప్రపంచ దేశాలు శంఖారావం పూరించాలి

United Nations: ప్రతి 11 నిమిషాలకు ఒక మహిళ తన సొంత వారి చేతుల్లోనే బలవుతోందని ఐక్య రాజ్య సమితి పేర్కొంది. అంతర్జాతీయంగా మానవ హక్కుల ఉల్లంఘనల్లో మహిళలపై హింసే అత్యంత ఎక్కువగా ఉందని ఐరాస అభిప్రాయపడింది. ఈ విపత్తును అధిగమించే కార్యాచరణ ప్రణాళికలు సిద్దం చేయాలని ప్రపంచ దేశాలకు ఐరాస పిలుపునిచ్చింది. నవంబర్ 25న మహిళలపై హింస నిర్మూలన దినం సందర్భంగా ఐక్య రాజ్య సమితి కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఐరాసా చీఫ్ ఆంటోనియో గుటెర్రెస్ మాట్లాడుతూ ఈ విషయాలు వెల్లడించారు.

‘‘ప్రపంచ వ్యాప్తంగా జరుగుతోన్న మానవ హక్కుల ఉల్లంఘనల్లో మహిళలు, బాలికలపై జరుగుతోన్న హింసే ప్రధానమైనది. ప్రతి 11 నిమిషాలకు ఒక మహిళ లేదంటే బాలిక తన కుటుంబీకులు లేదంటే అత్యంత సన్నిహితుల చేతుల్లోనే బలవుతోంది. కరోనా మహమ్మారి మొదలు ఆర్థిక సంక్షోభం వరకు వారిపై భౌతికంగా, మౌఖిక దాడులు మరింత పెరుగుతున్నాయి. మహిళలపై ఆన్‌లైన్‌ హింస కూడా ప్రబలంగా ఉంది. లైంగిక వేధింపులతోపాటు మహిళల వస్త్రధారణ, ఫొటోల వంటి విషయాల్లో ఎన్నో రకాలుగా దాడులు కొనసాగుతున్నాయి’’ అని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ అన్నారు.

‘‘ఈ వివక్ష, హింస, దుర్వినియోగం మానవత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. అన్ని రంగాల్లోని మహిళలు దీనికి బాధితులు అవుతున్నారు. మహిళల ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛలను హరిస్తున్నారు. ఇది ప్రపంచానికి అవసరమైన సమాన అవకాశాలను, ఆర్థిక పునరుద్ధరణను అడ్డుకుంటోంది. మహిళలపై జరుగుతోన్న హింసను ఇక చరిత్ర పుస్తకాల్లోకి పంపాలి. ఇందుకు ప్రపంచ దేశాలు శంఖారావం పూరించాలి. ప్రభుత్వాలు ఇందుకోసం ప్రణాళికలు రూపొందించి, అమలు చేయాలి. ఈ క్రమంలో మహిళా హక్కుల సంస్థలకు ఎక్కువ మొత్తంలో నిధులు పెంచాలి’’ అని ఐరాస సెక్రటరీ జనరల్‌ సూచించారు. అలాగే 2026 నాటికి మహిళా హక్కుల కోసం పోరాడే సంస్థలకు నిధులు 50 శాతం పెంచాలని ప్రభుత్వాలకు గుటెర్రస్ పిలుపునిచ్చారు.

Strange Video: వీడిన చైనా గొర్రెల మిస్టరీ.. గొర్రెలు అలా గుండ్రంగా ఎందుకు తిరిగాయంటే?

ట్రెండింగ్ వార్తలు