×
Ad

ఆ టౌన్లో అంతా అందమైన అమ్మాయిలే..కానీ పెళ్లి చేసుకోవట్లేదు..కారణం వెనుక పెద్ద కథే

  • Published On : March 30, 2021 / 05:21 PM IST

Bronze Age Mining Sites Received Deliveries Pre Processed Foods (1)

Brazilian Town Beautifull  girls remain Unmarried : అది దక్షిణ అమెరికాలో దేశాలలోఅతి పెద్ద దేశం. వైశాల్యం రీత్యా ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద దేశం బ్రెజిల్. బ్రెజిల్ లో బ్రెజిల్లో రెండవ అత్యధిక జనాభా కలిగిన నగరం రియో డి జనీరో. ఈ నగరానికి ఉత్తరాన 500 కిలోమీటర్ల దూరంలో ప్రకృతి పరశించిపోయే అందమైన మనోహరమైన ‘నోయివాడో కార్డెరో’ (Noiva Do Cordero) చిన్న టౌన్.

 

ఎంతో అందమైన ఈ గ్రామంలో అంతకంటే అందమైన అప్సరసల్లాంటి అమ్మాయిలు చాలా చాలా ప్రత్యేకమైనవారు. అందాలకు నిలయంగా ఉండే నోయివాడోలో అందమైన అమ్మాయిలు చాలామంది ఉంటారు. ఇక్కడుండే చాలామంది అమ్మాయిలు పెళ్లి చేసుకోకపోవటమే ఆ ప్రత్యేకత..! ఇక్కడి అమ్మాయిలు పెళ్లి చేసుకోకపోవటం గురించి చాలా పెద్ద కథే ఉంది.

అదే ప్రపంచంలోనే ఈ నోయివాడో కార్డెరో పెళ్లికాని అమ్మాయిల గ్రామంగా పేరొందింది. బ్రెజిల్‌లోని ‘నోయివాడో కార్డెరో’ లో అబ్బాయిల సంఖ్య కంటే అమ్మాయిల సంఖ్య ఎక్కువ. ఇక్కడ చాలామంది అమ్మాయిలు ఒంటరిగా నివసిస్తున్నారు. పెళ్లి చేసుకోకుండా..ఈ గ్రామానికి మరో ప్రత్యేకత ఏమిటంటే..అమ్మాయిలు పెళ్లి చేసుకున్న తర్వాత ఈ గ్రామంలోనే ఉంటారు. ఇది ఆ గ్రామ సంప్రదాయం.

ఈ గ్రామం ప్రజల సంఖ్య 600. 18 నుండి 30 సంవత్సరాల వయస్సు గల 300 మంది మహిళలు ఉన్నారు. ఈ 300 మంది మహిళలు ఇకపై వివాహం చేసుకోలేదు. కాబట్టి ఒంటరితనం గడిపే అమ్మాయిలే ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు. నోయివాడో కార్డెరోలో అమ్మాయి అందం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వికసించే బోగన్ విలిలా పువ్వుల్లా అందంగా..ఆకర్షణీకంగా కళ్లు తిప్పుకోనివ్వని అందం ఇక్కడ అమ్మాయిల సొంతం.

ఇంత అందమైన ఈ అమ్మాయిలు పెళ్లి చేసుకోవటానికి రెడీగానే ఉన్నారు. కానీ చేసుకునేదెవరు? స్థానికంగా అబ్బాయిల కొరత ఉంది. ఈ అమ్మాయిలు బయటి వారు వాళ్లను పెళ్లి చేసుకోరు. చేసుకుంటే ఆ ఊళ్లోనే ఉండాలి. కానీ వారిని పెళ్లిచేసుకుని అక్కడే ఉండిపోవటానికి అబ్బాయిలు సిద్ధంగా లేరు.

దీంతో ఇంత అందమైన అమ్మాయిలకు పెళ్లిళ్లు కావటంలేదు. దాంతో ఒంటరిగానే ఉండాల్సి వస్తోంది. ఒంటరి జీవితమే ఈ బోగన్ విలియాల్లాంటి సొగసైన అమ్మాయిలకు దిక్కవుతోంది.