'false Positive' Covid Tests Created By Schoolchildren Using Fruit Juice
False positive Covid tests : కరోనావైరస్ టెస్టుకు ముందు ఎవరైనా ఇలాంటి పదార్థాలను తింటే మాత్రం వచ్చే ఫలితం తారుమారువుతుందట.. కరోనా టెస్టు కోసం సేకరించిన స్వాబ్ శాంపిల్స్ ఫలితాలు ఒక్కసారిగా మారిపోయినట్టు గుర్తించారు. ఎందుకు ఇలా జరుగుతుందని పరిశీలిస్తే.. టెస్టుకు ముందు పళ్ల రసాలు తాగినవారిలో కరోనా ఫలితాలు పాజిటివ్ అంటూ తప్పుగా వస్తుందట.. సుదీర్ఘ కాలం పాటు లాక్ డౌన్లతో ఇంట్లోనే ఉన్న పిల్లలంతా లాక్ డౌన్ ఎత్తేయడంతో బళ్లకు వెళ్లాల్సి వస్తోంది. ఇంగ్లండ్‌లోని పిల్లలు బడికి వెళ్లకుండా ఉండేందుకు ఓ తుంటరి ఉపాయం ఆలోచించారట..
బడులకు వెళ్లేముందు అందరి పిల్లలకు కరోనా టెస్టులు చేయిస్తున్నారట.. కరోనా నెగటివ్ సర్టిఫికెట్ వస్తే బడికి వెళ్లవచ్చు.. అందుకే ముందుగా పళ్ల రసాలు తాగి వెళ్తున్నారట.. అలా వెళ్తే కరోనా పాజిటివ్ అని వస్తుందట.. దాంతో బడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండొచ్చునని అలాచేస్తున్నారట.. పండ్ల రసాల్ని, కెచప్‌లతో కరోనా పాజిటివ్ సర్టిఫికెట్లు తెచ్చుకుంటున్నారట.. పిల్లల తుంటరి పనిని గమనించిన ఓ స్కూల్ యాజమాన్యం తల్లిదండ్రులకు వార్నింగ్ మెసేజ్ పంపిందట.. ఇప్పుడా మెసేజ్ వైరల్ కావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
మెర్సెసైడ్‌లో గేట్‌ఎకర్ స్కూల్ యాజమాన్యం పిల్లల పేరెంట్స్‌కి మెయిల్ పంపింది. ర్యాపిడ్ టెస్ట్ లాంటి ల్యాటెరల్ ఫ్లో టెస్ట్‌లో చాలామంది పిల్లలు ఆరెంజ్, కచెప్, పండ్ల రసాలు తాగుతున్నారని గుర్తించారు. దాంతో స్వాబ్ శాంపిల్స్ మారిపోయి ఫలితం తేడా వస్తోందట.. పిల్లలకు ఆరోగ్యంగా ఉన్నా కరోనా పాజిటివ్ రిజల్ట్ వస్తోందని స్కూల్ యాజమాన్యం తెలిపింది. మరోసారి ఇలాంటి తప్పుడు చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని మెయిల్‌లో హెచ్చరించింది.
ఇటీవల నిర్వహించిన పలు కరోనా టెస్టుల్లో విద్యార్థులకు పాజిటివ్ రిపోర్టులు వచ్చాయట. ఆర్టీపీసీఆర్ టెస్ట్ రిపోర్టులనే నమ్ముతామని పేరెంట్స్‌కి మెయిల్ లో పేర్కొంది. పండ్ల రసాలు, ఫిజ్జీలాంటి జ్యూస్‌లతో కొందరు కరోనా టెస్టులపై టిక్‌టాక్‌లు చేస్తున్నారని, అవి చూసే పిల్లలు నేర్చుకుంటున్నారని అంటున్నారు.