క్రిస్మస్ ట్రీలో గుడ్లగూబ.. అనుకోని అతిథితో షాక్!

  • Publish Date - December 21, 2019 / 10:35 AM IST

క్రిస్మస్ సెలబ్రేషన్స్ మొదలైపోయాయి. ప్రతిఒక్కరూ తమ ఇంటిని క్రిస్మస్ ట్రీలతో అందంగా అలకరించుకుంటున్నారు. అందరిలానే జార్జియాకు చెందిన కుటుంబం కూడా ఎత్తైన క్రిస్మస్ ట్రీని తమ ఇంట్లో ఏర్పాటు చేసి అందంగా అలకరించారు. కొన్నిరోజుల తర్వాత వారు అలకరించిన క్రిస్మస్ ట్రీ కొమ్మల మధ్య పిట్టగూడు కనిపించింది. ఏంటా అని దగ్గరకు వెళ్లి చూస్తే.. అది గుడ్లగూబ. దీంతో జార్జీయా కుటుంబ సభ్యులంతా షాక్ అయ్యారు.

దీనిపై కాటే మెక్ బ్రైడ్ న్యూమ్యాన్ మాట్లాడుతూ.. డిసెంబర్ 12న తమ ఇంటి క్రిస్మస్ ట్రీ కొమ్మల మధ్య ఓ పక్షిని తన కుమార్తెతో కలిసి గుర్తించినట్టు తెలిపింది. 10 అడుగులు (3 మీటర్లు) ఎత్తైన క్రిస్మస్ ట్రీని తమ ఇంటి ఆవరణంలో ఏర్పాటు చేసినట్టు పేర్కొంది. అట్లాంటా ప్రాంతం నుంచి తమ ఇంటికి తీసుకొచ్చినట్టు తెలిపింది. విద్యుత్ వెలుగులతో అలరించామని, ఓ రోజు అనుకోకుండా గుడ్లగూబ కూడా అలంకరణలో కనిపించడంతో ఆశ్చర్యపోయినట్టు చెప్పుకొచ్చింది.

‘అది నిజంగా గుడ్లగూబే. కానీ, మేం దాన్ని చూసి భయపడలేదు. అడవి వంటి ప్రదేశాల్లో తిరగడమే మాకు ఇష్టం. అందుకే పెద్దగా భయమనిపించలేదు’ అని తెలిపింది. క్రిస్మస్ ట్రీలోని గుడ్లగూబ బయటికి వెళ్లిపోతుందని అలానే కిటికీలను తెరిచే ఉంచుతోందా ఫ్యామిలీ.

కానీ, అది ఎక్కడికి వెళ్లడం లేదు. దీంతో మెక్ బ్రైడ్ కుటుంబం.. నాన్ ప్రాఫిట్ నేచర్ సెంటర్ కు కాల్ చేసి సాయం కోరింది. చట్టాహూచీ నేచర్ సెంటర్ అధికారులు వచ్చి ఆ గుడ్లగూబను పట్టుకుని తీసుకెళ్లారు.