China Grows Rice In Space : అంతరిక్షంలోనే వ్యవసాయం..! వరి పంట పండించి కోత కోసిన చైనా.. చంద్రుడు, అంగారకుడిపై వ్యవసాయానికి తొలి అడుగు..
China Rice Grown In Space : చైనా చేపట్టిన షెంజౌ-23 మిషన్‌లో భాగంగా మే 24న వరి విత్తనాలను టియాంగాంగ్ స్పేస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. రెండు నెలలకు పైగా సూక్ష్మ గురుత్వాకర్షణ పరిస్థితుల్లో వాటిని పెంచిన అనంతరం వ్యోమగాములు జూ యాంగ్జు, జాంగ్ జియువాన్, లై కైయింగ్ తొలి వరి నమూనాలను సేకరించారు.
- Harish Thanniru
- Published on- August 9, 2026 / 01:25 PM IST
China rice grown in space
China Grows Rice In Space : రాబోయే రోజుల్లో అంతరిక్ష కేంద్రాల్లోనే పంటలు పండించి.. వ్యోమగాములు అక్కడే భోజనం తయారు చేసుకునే రోజులు రాబోతున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆమేరకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇందుకు ఊతమిచ్చేలా చైనా చేపట్టిన ప్రయోగం విజయవంతం అయింది. భూమికి వందల కిలోమీటర్ల ఎత్తులో ఉన్న చైనా ‘తియాంగాంగ్’ అంతరిక్ష కేంద్రంలో వ్యోమగాములు వరి పంటను తొలిసారి విజయవంతంగా పండించారు. విత్తనం వేసి ధాన్యాన్ని నూర్పే వరకు జీవిత చక్రాన్ని పూర్తిచేసి ప్రతిష్టాత్మక మైలురాయిని దాటారు.
Also Read : Indian Railways Rule : రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. ఈ కొత్త రూల్ మీకు తెలుసా..? ఇలాచేస్తే డబ్బులొస్తాయ్..
చైనా చేపట్టిన షెంజౌ-23 మిషన్‌లో భాగంగా మే 24న వరి విత్తనాలను టియాంగాంగ్ స్పేస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. రెండు నెలలకు పైగా సూక్ష్మ గురుత్వాకర్షణ పరిస్థితుల్లో వాటిని పెంచిన అనంతరం వ్యోమగాములు జూ యాంగ్జు, జాంగ్ జియువాన్, లై కైయింగ్ తొలి వరి నమూనాలను సేకరించారు. అంతరిక్ష ఇక్యూబేటర్లలో ప్రత్యేక ఎల్ఈడీ కాంతి, ద్రవ పోషకాల ద్వారా నీరు, ఎరువులను అందించి వరి పంట పండించారు. సాధారణంగా భూమిపై గురుత్వాకర్షణ ప్రభావంతో మొక్కల వేళ్లు కిందికి , కాండం పైకి పెరుగుతాయి. అయితే, అంతరిక్షంలోని మైక్రోగ్రావిటీ (శూన్య గురుత్వాకర్షణ శక్తి)లో వాతావరణంలో మొక్కల పెరుగుదల శైలి మారినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
చైనా శాస్త్రవేత్తలు ఈ ప్రయోగంలో రెండు రకాల జపోనికా వరి విత్తనాలను ఉపయోగించారు. ఒకటి అంతరిక్షానికి ఎప్పుడూ వెళ్లని సాధారణ విత్తనాలు కాగా, మరొకటి 2022లో టియాంగాంగ్‌లో పండించిన వరి నుంచి వచ్చిన విత్తనాలు. అంతరిక్ష వాతావరణానికి గతంలో అలవాటు పడిన విత్తనాలు తరువాతి తరాల్లో ఎలా స్పందిస్తాయో శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. 2022లో చైనా అంతరిక్షంలో తొలిసారిగా వరి పూర్తి జీవచక్ర ప్రయోగాన్ని నిర్వహించింది. ఆ సమయంలో ఆరు వరి విత్తనాలను 120 రోజులపాటు కక్ష్యలో పెంచగా, 59 కొత్త విత్తనాలు లభించాయి. వాటిని భూమికి తీసుకువచ్చి తదుపరి పరిశోధనలు చేశారు.
తాజా సంచలన ప్రయోగం ద్వారా రోదసీలోనే ఆహారాన్ని పండించటమే కాకుండా.. వ్యోమగాములు విడుదల చేసే కార్బన్ డై అక్సైడ్ ను గ్రహించి ఆక్సిజన్ ను విడుదల చేయటానికి కూడా అవకాశం దొరికింది. నీటి వ్యవస్థ సహజ సిద్ధంగా శుద్ధి చేయటం కూడా సాధ్యమవుతుంది. అంతరిక్షంలో క్లోజ్డ్ -లూప్ ఎకో సిస్టమ్ రూపుదిద్దుకోవడానికి ఇది ప్రాథమిక అడుగుగా భావిస్తున్నారు.
భవిష్యత్తులో మార్స్, చంద్రుడిపై కాలనీలు నిర్మించే క్రమంలో భూమి నుంచి ప్రతీసారి ఆహారాన్ని మోసుకెళ్లే అవసరం లేకుండా, అక్కడే స్వయం పంటలు పండించేందుకు ఇక మీదట 100శాతం సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అంతేకాదు.. ఈ అంతరిక్ష వరి విత్తనాల్లోని జన్యుపరమైన మార్పులను అధ్యయనం చేయడం ద్వారా భూమిపై తీవ్ర ప్రతికూల వాతావరణ మార్పులను ఎధుర్కొనే నూతన వరి రకాలను అభివృద్ధి చేయడానికి కూడా ఈ పరిశోధన దోహదపడుతుందని చెబుతున్నారు.
Aiming for world’s first two-generation rice cultivation in orbit! China’s Shenzhou-23 astronauts have completed a new rice-growing experiment aboard China’s space station, comparing two types of rice seeds to advance space farming. pic.twitter.com/oyzfMxbRSz
— LI Jian (@Europe_MFA_CHN) August 3, 2026
